సల్మాన్ కు వైద్య పరీక్షలు…

0కృష్ణ జింక కేసులో దోషి గా తేలిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సల్మాన్ కు వైద్య పరీక్షల అనంతరం జోథ్‌పూర్ జైల్ ఒకటోనెంబర్ బారక్‌కు తరలించబోతున్నారు. కేసులో సల్మాన్ దోషి గా తేలడం తో ఆయన సోదరులు అర్పితా ఖాన్, అల్విరా అగ్నిహోత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

సోదరులిద్దరిని సల్మాన్ ఓదార్చారు. ఇక జైలు వెలుపల, కోర్టు బయట బిష్ణోయ్ తెగవారు సల్మాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వన్యప్రాణి సంవరక్షణ చట్టం కఠినతరంగా ఉన్నందున సల్మాన్‌కు బెయిల్ వస్తుందా? రాదా? అనేది హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుందని లాయర్లు చెపుతున్నారు. సల్మాన్ కేసు ఇన్నాళ్లు సాగిందంటే అందుకు కారణం బిష్ణోయ్ తెగవారే అని చెప్పాలి. ఇక సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష ప్రకటించినట్లు తెలియగానే బిష్ణోయ్ తెగవారు సంబరాలు చేసుకున్నారు.