ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పిన సల్మాన్

0కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ను దోషిగా జోధ్‌పూర్‌ న్యాయస్థానం తేల్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష విధించారు. అయితే కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. రెండు రోజులు జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో గడిపిన సల్మాన్‌ బెయిలుపై శనివారం బయటికి వచ్చారు.

ఈ క్రమంలో బాలీవుడ్‌ ప్రముఖులు, అభిమానులు సల్మాన్‌కు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఆయన మంచి తనాన్ని, చేసిన సామాజిక సేవలను గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో సల్మాన్ అందరికీ థ్యాంక్స్ చెప్పారు. తన క్షేమం కోరుతూ ప్రార్థించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు చెప్పారు.

”నాకు ఎప్పుడూ మద్దతుగా ఉన్న ప్రియమైన వారికి, ధైర్యం కోల్పోని వారికి కన్నీటి కృతజ్ఞతలు. మీ ప్రేమ, ఆదరణను ఎల్లప్పుడూ అందిస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు సల్మాన్.