మామగారు.. కోడలమ్మ..కిషోర్ గారు!

0

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘మన్మథుడు 2’ షూటింగ్ లో పాల్గొంటున్నారనే సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లో జరుగుతోంది. పోర్చుగల్ షెడ్యూల్ నుంచి ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ‘మన్మథుడు 2’ టీమ్ మెంబర్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోలను పంచుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో సమంతా ఒక క్యామియో చేస్తోంది.అందుకోసమే గత రెండు రోజులుగా ‘మన్మథుడు 2’ తో కలిసి షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ విషయం వెల్లడిస్తూ రాహుల్ రవీంద్రన్ మే 1 న సమంతా.. వెన్నెల కిషోర్ తో కలిసి ఉన్న ఒక ఫోటో ను షేర్ చేశాడు. తాజాగా ‘మన్మథుడు 2’ షూట్ లొకేషన్ నుండి మరో ఫోటో బైటకు వచ్చింది. ఇది రాహుల్ రవీంద్రన్ తీసిన సెల్ఫీ. ఈ సెల్ఫీలో వెన్నెల కిషోర్.. సమంతాల తో పాటు నాగార్జున కూడా ఉన్నారు. అందరూ నవ్వుతూ ఉన్నారు కానీ ఒక్క వెన్నెల కిషోర్ మాత్రం స్మైల్ ఇస్తూనే అదోరకం ఫేస్ పెట్టాడు. మామగారు నాగార్జున ఇలా కోడలమ్మతో.. ఆమె ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసిపోయి ఉండడం నెటిజనులను మెప్పిస్తోంది.

‘మన్మథుడు 2’ లో సమంతా ఎలాంటి పాత్ర పోషిస్తోందో కానీ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందనడం లో సందేహం లేదు. ఈ సినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. RX100 ఫేం చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
Please Read Disclaimer