పురంధేశ్వరి – కృపారాణిలు డ్రామాలు కట్టిపెట్టాలి : ఉద్యమకారులు

0

purandeswariకేంద్రమంత్రులు పురంధేశ్వరి, కిల్లి కృపారాణి, జేడి శీలం, పళ్లం రాజులు డ్రామాలు ఆపి, ఉద్యమంలో పాలుపంచుకోవాలని సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి శుక్రవారం పిలుపునిచ్చింది. లేదంటే విమానాశ్రయంలో అడుగుపెట్టనీయమని వారు సమితి నేతలు హెచ్చరించారు.

ఇదే అంశంపై సమితి నేతలు మాట్లాడుతూ ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్‌ను కలిశామని, చట్టసభల్లో తమ వాదన వినిపించేందుకు రాజీనామాలు వద్దన్నారని, రాజీనామాలు ఆయన వద్దే పెట్టుకున్నారని మంత్రులు చెప్పడం మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. దిగ్విజయ్ సింగ్‌కు రాజీనామా లేఖలు ఇచ్చామని మంత్రులు చెపితే వినేందుకు తామేమీ పిచ్చోళ్లం కామన్నారు.

ఇకపైనా మాటలు, డ్రామాలు కట్టిపెట్టి రాజీనామాలు చేసే వరకు వారిని సీమాంధ్రలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. రాజీనామాలు చేయకుండా వారు వస్తే తాము విశాఖపట్నం విమానాశ్రయంలోనే అడ్డుకుంటామన్నారు.

samaikhyanra agitators fire on killi kruparani and purandeswari
Please Read Disclaimer