సమంతకు పిల్లలు పుట్టకపొతే…

0సమంత నాగ చైతన్య బెస్ట్ కపుల్స్. గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా వుంది. ఇంత బిజీలోనూ క్షణం తీరిక దొరికితే చాలు ప్రేమ పక్షుల్లా విదేశాలు చుట్టుకోస్తారు. తాజాగా తమ వ్యక్తిగత జీవితం పై సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. పిల్లలు ఎప్పుడు ? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ”పిల్లల గురించి చెప్పాలంటే నేనూ, చైతూ ఒక డేట్‌ పెట్టుకున్నాం. ఆ డేట్‌ ఫిక్స్‌ అయిపోయిందనే చెప్పాలని నవ్వేసింది.

అంతేకాదు అనుకున్న సమయంలోనే పిల్లలు పుడతారు అని చెప్పలేం. దీని గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే అనుకున్న సమయానికి పిల్లలు పుట్టకపోతే అందరి కళ్లు చైతూపైనే ఉంటాయని నవ్వేసింది. అయితే నాకు బేబీ పుడితే తనే నా ప్రపంచం అవుతుంది. నా సమయమంతా తనతోనే. నేను చిన్నప్పుడు అనుభవించలేనిది నా బేబీకి అందించాలని అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది సామ్