Templates by BIGtheme NET
Home >> Cinema News >> వైరల్ అవుతున్న ‘చైతూ-సామ్’ల లవ్ పిక్!!

వైరల్ అవుతున్న ‘చైతూ-సామ్’ల లవ్ పిక్!!


2010లో ‘ఏ మాయ చేసావే’ లాంటి సినిమా యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమాతో పరిచయం అయ్యారు అక్కినేని నాగచైతన్య సమంత. ఫస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఇటు వైపు వీరిద్దరి మధ్య ప్రేమ విషయం బయటపడింది. నిజానికి సమంత చైతూ ఇద్దరు కూడా ఏ మాయ చేసావే మూవీ షూటింగ్ టైంలోనే అట్ట్రాక్ట్ అయిపోయారట. ఆ తర్వాత సినిమా షూటింగ్ ఎండింగ్ కి వచ్చేసరికి ఇద్దరి మధ్య ఉంది అట్రాక్షన్ కాదు లవ్ అని తెలుసుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలలో కలిసి పనిచేసారు కానీ ఎప్పుడు కూడా విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. ఇక చివరికి 2017లో నాగచైతన్య సమంతలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుండి వీరి జంట చూడముచ్చట ఉందంటూ కంప్లిమెంట్స్ లభిస్తూనే ఉన్నాయి.

ఇక సినిమాలు కాకుండా అప్పుడప్పుడు ఇద్దరు కెమెరా ముందు దర్శనమిస్తుంటారు. వీరిద్దరూ ఒకేసారి కనిపించారంటే అభిమానులకు పండగే అని చెప్పాలి. తాజాగా చైతూ – సమంతలు.. టాలీవుడ్ టాల్ హీరో రానా పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో సమంత వేరే వైపు చూసి మాట్లాడుతుండగా తన తల పై నాగచైతన్య ఏదో వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఆ ఫోటో చాలా సరదాగానే ఉందనుకోండి. ప్రస్తుతం ఆ పిక్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ మరోసారి కలిసి ఒకే సినిమాలో కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమాల పరంగా సమంత నాగచైతన్య ఇద్దరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. చూడాలి మరి ఏ సినిమాలో ఇద్దరు కనిపించి అభిమానులను హ్యాపీ చేస్తారో..!