నాగ చైతన్య – సమంత యాడ్ ఇరగదీశారు!

0టాలీవుడ్ క్యూట్ కపుల్ వెండితెర మీద అదరగొట్టడమేమో గాని.. ప్రస్తుతం బుల్లితెర మీద అదరగొట్టేస్తున్నారు. ఆ క్యూట్ కపుల్స్ ఎవరు అంటే నాగ చైతన్య – సమంత లండి. నాగ చైతన్య – సమంతలు ఐదేళ్లుగా సీక్రెట్ గా లవ్ చేసుకుని మరీ పెద్దల సమక్షంలో గత అక్టోబర్ లో పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్ళయాక నెలరోజులు కూడా ఎంజాయ్ చెయ్యకుండా కెరీర్ మీద దృష్టి పెట్టిన ఈ జంటను చూస్తే అందరికి ముచ్చటేస్తుంది. సమంత పెళ్లి తరవాత రాజుగారి గది 2, రంగస్థలం హిట్స్ తో దూసుకుపోతుంటే, నాగ చైతన్య రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి. అయితే రీల్ లైఫ్ లో గతంలో అంటే పెళ్లి కాకమునుపు మూడు సినిమాలు చేసిన ఈ జంటతో పెళ్లయ్యాక కూడా వెండితెర మీద జంటగా నటింప చెయ్యాలని మారుతీ వంటి దర్శకులు చూడగా… చివరికి వారిని డైరెక్ట్ చేసే అవకాశం నిన్నుకోరి ఫెమ్ శివ నిర్వాణకే దక్కింది.

అయితే పెళ్లి తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సామ్ – చై సినిమా ఇంకా సెట్స్ మీదికెళ్ళలేదు కానీ.. అప్పుడే ఈ జంట బుల్లితెర మీద మాత్రం సందడి చేస్తున్నారు. పెళ్లయ్యాక కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గని సమంత సినిమాల మీద సినిమాలు చేస్తుంటే… ఇప్పుడు తన భర్త నాగ చైతన్యతో కలిసి బిగ్ బజార్ వారి యాడ్ లో నటించింది. నాగ చైతన్య – సమంతలిద్దరు దంపతులుగా బిగ్ బజార్ వారి బ్రాండ్స్ కి అంబాసిడర్లు.. బిగ్ బజార్ ని ప్రమోట్ చేస్తున్నారు. ప్రసుతం చైతు – సామ్ ల బిగ్ బజార్ యాడ్స్ రెండు మూడు టివి ఛానల్స్ లో ప్రసారం అవుతున్నాయి. మరి ఈ యాడ్స్ లో చై – సామ్ ల కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయింది. నిజమైన భార్య భర్తలు కలిసి ఒక యాడ్ లో నటించడం అనే కంటే జీవించారని చెప్పొచ్చు.

బిగ్ బజార్ బ్రాండ్స్ ని పబ్లిసిటీ చేస్తూ బిగ్ బజార్ కి బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారు వీరిద్దరూ. మరి ఈ జంట అలా యాడ్ లో కనిపిస్తేనే తెలుగు ప్రేక్షకులు తెగ ఇదైపోతుంటే.. మళ్లీ వీరిద్దరూ కలిసి వెండితెర మీద కనిపిస్తే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. అందుకే ఈజంటతో సినిమా చేసి హిట్ కోట్టేయాలనే కసితో శివ నిర్వాణతో పాటు కోన వెంకట్ కూడా ఉన్నాడు.