స్పెయిన్ లో అక్కినేని ఫ్యామిలీ రచ్చ

0

కాదేది ఎంజాయ్ మెంట్ కు అనర్హం అనేలా ఉంటుంది కింగ్ నాగార్జున స్టైల్. ఎన్ని సినిమాలు చేసినా వయసు ఎంత మీద పడుతున్నా అది తనకు మాత్రం వర్తించదు అనేలా లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో నాగ్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. దేవదాస్ విడుదలకు ఒక్క రోజు ముందు ఫ్లైట్ ఎక్కేసి హాలిడే కోసం వెళ్ళిపోయిన నాగ్ నేరుగా తన కొడుకు నాగ చైతన్య కోడలు సమంతాతో కలిసి జాయిన్ అయిపోయాడు. తానొక్కడే కాదు లెండి. అఖిల్ తో సహా మొత్తం కుటుంబం సహా అక్కడే తిష్ట వేసి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. వాటి తాలూకు ఫొటోలు ఆన్ లైన్ రచ్చ చేస్తున్నాయి. ముఖ్యంగా పెళ్ళై ఏడాది పూర్తయిన సందర్భంగా చైతు సామ్ ల జంట మరీ మరీ స్పెషల్ గా కనిపిస్తోంది. రెస్టారెంట్ .లో వైన్ తాగుతున్న దృశ్యం పబ్ లో ఇద్దరూ కలిసి సరదాగా డాన్స్ చేస్తూ గడపడం తమతో పాటు వచ్చిన ఫామిలీ ఫ్రెండ్ కం మోడల్ శిల్పా రెడ్డి చేస్తున్న హంగామా తక్కువేమి లేదు.

ఇబిజా ఐలాండ్ వేదికగా జరుగుతున్న ఈ సంబరాన్ని సమంతాతో పాటు నాగార్జున ఎప్పటికప్పుడు కెమెరాల్లో బందిస్తూ వీలు దొరికినప్పుడంతా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో అక్కినేని ఫామిలీ సినిమాలు మూడు వచ్చాయి. నాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడు-సమంతా యుటర్న్-నాగ్ దేవదాస్ ఏది యునానిమస్ గా బ్లాక్ బస్టర్ రిజల్ట్ తెచ్చుకోనప్పటికీ వ్యక్తిగతంగా వాళ్లకు మాత్రం బాగా నచ్చిన సినిమాలయ్యాయి. తిరిగి వచ్చాక ఎవరికి వారు యమా బిజీగా మారబోతున్నారు. అందుకే ఏ క్షణాన్ని వేస్ట్ చేసుకోకుండా అక్కినేని ఫ్యామిలీ మొత్తం స్పెయిన్ ని చుట్టేస్తోంది. అయినా ఎప్పుడూ సినిమాలు అంటూ తలచెడగొట్టుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటి టూర్లు మానసిక ఉల్లాసానికి చాలా అవసరం. నాగ్ లాగే చైతు అఖిల్ లు కూడా ఇదే ఫార్ములానే ఫాలో అవుతున్నారు.
Please Read Disclaimer