రైల్వే స్టేషన్ లో చై – సామ్ ఏం చేస్తున్నారు?

0

నాగచైతన్య సమంత పెళ్లి తర్వాత నటిస్తున్న చిత్రం ‘మజిలి’. శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ సమీపంలోని సింహాచలంలో చిత్రీకరణ జరుపుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత ఒక మద్య తరగతి గృహిణిగా కనిపించబోతున్న విషయం తెల్సిందే. నాగచైతన్య మరియు సమంతలు సినిమాలో కూడా భార్య భర్తలుగా కనిపించబోతున్నారు. సినిమాకు సంబంధించిన చిత్రీకరణ సింహాచలం రైల్వే స్టేషన్ లో జరుగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున జనాలు అక్కడకు చేరుకున్నారు.

రైల్వే స్టేషన్ లో బుకింగ్ ఎంప్లాయిగా సమంత నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. షూటింగ్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చాలా సింపుల్ గా సమంత కనిపిస్తోంది. మెడలో నల్ల పూసల దండతో ఒక మామూలు పంజాబీ డ్రస్ లో సమంత చిత్రీకరణలో పాల్గొంటోంది. భార్య భర్తల మద్య సాగే ఒక విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రంను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

సమంత – నాగచైతన్యల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఏమాయ చేశావే’ – ‘మనం’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరో సినిమా ‘ఆటో నగర్ సూర్య’ మాత్రం అంతంత మాత్రంగానే నిలిచింది. వీరిద్దరి కాంబోలో వస్తున్న నాల్గవ సినిమా అవ్వడం మరియు పెళ్లి తర్వాత నటిస్తున్న మొదటి సినిమా అది కూడా భార్య భర్తలుగా నటిస్తున్నారు అనే ప్రచారం జరుగుతున్న కారణంగా సినిమాపై అన్ని వర్గాల వారు అంచనాలు పెంచుకున్నారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.




Please Read Disclaimer