#చెయ్ సామ్.. డామినేట్ చేసేసిన సమంత

0టాలీవుడ్ బెస్ట్ జోడి సమంత చైతూ వివాహం జరిగి అప్పుడే ఏడాది దగ్గరపడుతోంది. మ్యారేజ్ లైఫ్ ని రెగ్యులర్ గా ఎంజాయ్ చేస్తూనే కెరీర్ పరంగా కూడా ఇద్దరు ఒక లెవెల్లో వెళుతున్నారు. సమంత అయితే ఇంకా దూకుడు పెంచేసింది. ఇక వీరిద్దరి వివాహం అందరికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సౌత్ లోనే గత ఏడాది చై సామ్ వివాహం ఒక సెన్సేషనల్ అయ్యింది. స్టార్స్ ఒక్కటైతే ఆ మాత్రం ఉండాలి కదా..

ఇక పెళ్లి నాటి గుర్తులు ఏవో ఒకటి ఇంకా స్టార్స్ జీవితాన్ని సంతోషపరుస్తూనే ఉన్నాయి. కలకాలం ఆ స్పెషల్ మూమెంట్స్ కి క్రేజ్ తగ్గేలా లేదు. ఫ్యాన్స్ కూడా ఆ మూమెంట్స్ కి పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గా సమంత తన పెళ్లి నాటి కొన్ని మధురమైన అనుభవాలను వీడియో ద్వారా షేర్ చేసింది. క్లిప్స్ మొత్తం ఒక వీడియోలో యాడ్ చేసి బలే ఎట్రాక్ట్ చేశారని చెప్పాలి. చైతు టై ఎక్కడ అని మొదలవ్వగానే అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా కనిపించింది. ఇక సమంత అయితే మరో హైలెట్..

నవ్వుతూ సరదాగా ఉండి.. పెళ్లిలో అందరికంటే ఎక్కువగా ఎంజాయ్ చేశారనే చెప్పాలి. ఓ విధంగా ఏంజాయ్మెంట్ లో సమంత చైతుని డామినేట్ చేసేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో అందరిని తెగ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే ట్రేండింగ్ లిస్ట్ లో టాప్ లోకి వచ్చేలా ఉంది. 2017 అక్టోబర్ లో చైతూ సామ్ గోవాలో రెండు సార్లు పెళ్లి చేసుకొని ఒకటైన సంగతి తెలిసిందే.