ఎక్కువ స్ట్రెస్ ఫీలయ్యా.. వెకేషన్ కావాలి!

0

‘మజిలీ’ సూపర్ హిట్ కావడంతో నాగచైతన్య-సమంతా జోడీ ఫుల్ ఖుషీగా ఉన్నారు. చైతు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కావడం.. చైతు నటనకు ప్రశంసలు దక్కుతూ ఉండడంతో సమంతా హ్యాపీగా ఉందనే విషయం తన మాటలలోనే తెలుస్తోంది. ఈమధ్య ఒక ఇంటర్వ్యూ లో చై-సామ్ జోడీ చాలా విషయాలు పంచుకున్నారు. ‘మజిలీ’ షూటింగ్ మొదలు పెట్టినప్పుడు ఇదో ప్రత్యేకమైన సినిమా అనే భావన తన మనసులో ఉందని సమంతా చెప్పింది. అదే ఫీల్ ప్రేక్షకులకూ కలిగిందని.. అందుకే సినిమా విజయం సాధించిందని అభిప్రాయపడింది.

సమంతా మీకు లక్కీ ఛార్మ్ కదా? అని చైతును అడిగితే సమంతా సమాధానం ఇస్తూ “చైతునే నాకు లక్కీ ఛార్మ్. పెళ్ళి తర్వాత నా నటన.. కెరీర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తోందని అనిపిస్తోంది” అంటూ చైతుపై తన ప్రేమను కురిపించింది. మరోవైపు ఇదే ప్రశ్నకు చైతు డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చాడు. లక్కీ ఛార్మ్ అనడం కంటే తనకు సమంతా ఒక సపోర్ట్ అని చెప్తాను అంటూ తనకు ఫెయిల్యూర్ వచ్చిన సమయంలో సామ్ మద్దతుగా నిలుస్తుందని చెప్పాడు. ఒక సాధారణ ప్రేక్షకురాలిగా చైతు పాత్ర ను సినిమాలో చూసినప్పుడు ఎలా ఫీలయ్యారు? అని సమంతాను అడిగితే “ఇది చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. యంగ్.. మిడిల్ ఏజ్డ్ పాత్రలో చైతన్య మంచి వేరియేషన్ చూపించాడు” అంటూ ప్రశంసించింది.

‘మజిలీ’ సక్సెస్ తర్వాత నాగార్జున గారి రియాక్షన్ ఏంటి? అని అడిగితే చైతు సమాధానం ఇస్తూ “ఆ రోజు సడెన్ గా ఫోన్ చేసి ఎక్కడున్నారు? వస్తున్నాను అంటూ ఇంటికి వచ్చేశారు” అన్నాడు. సమంతా ‘సూపర్ డీలక్స్’ సినిమా గురించి చైతునుఅడిగితే “ఫస్ట్ హాఫ్ మాత్రం చూశాను. కథ ముందే తెలుసు కాబట్టి పెద్దగా షాక్ కాలేదు. ఇప్పుడిప్పుడే యాక్టర్ గా గ్రో అవుతునన్ను ఫ్యూచర్ లో ఇలాంటి సినిమాలు తప్పకుండా చేస్తాను” అన్నాడు. మీరు తమిళ సినిమా ఎప్పుడు చేస్తారు? అని అడిగితే.. పుట్టి పెరిగింది చెన్నైలోనే అని.. తమిళ సినిమాలంటే ఇష్టం అని చెప్పాడు. కాకపోతే ఇప్పుడు మనసంతా తెలుగు సినిమాలపైనే ఉందని అన్నాడు. సుమ్మర్ వెకేషన్ కు ఎప్పుడు వెళ్తున్నారు అంటే మే ఫస్ట్ వీక్ లో ప్లాన్ చేస్తున్నామని అన్నారు. సమంతా మాట్లాడుతూ ‘మజిలీ’ విషయంలో ఎక్కువ స్ట్రెస్ ఫీలయ్యానని నాకు తప్పకుండా వెకేషన్ కావాలని చెప్పింది. చైతుకు హిట్ ఇవ్వాలనే తపనతో నిజంగానే టెన్షన్ పడినట్టుంది సమంతా. ఏదైతేనేం.. మంచి హిట్ అయితే దక్కింది.




Please Read Disclaimer