బయోపిక్ లో సమంత గోల ఎక్కువైందా?

0ప్రస్తుతం టాలీవుడ్ లో అందరూ ఎక్కువగా ఎదురుచూస్తోన్న చిత్రం ఏదైనా ఉందా అని అంటే.. మహానటి కోసమే ఎదురుచూస్తున్నారని చెప్పాలి. సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రస్తుతం అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా తప్పకుండా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ కూడా నమ్మకంగా ఉంది. సావిత్రి జీవితాన్ని డైరెక్ట్ గా ఒకసారి తెరపై చూస్తే ఆమెను మళ్లీ చూసినట్టు ఉంటుందని ఆమె అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు.

అలాంటి గొప్ప నటి బయోపిక్ పై ఇప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్ర యూనిట్ అతి జాగ్రత్త అనుకోవాలా లేక ఎవరికి తెలియకుండా ఒక ఊహ అందరిని డైవర్ట్ చేస్తోందా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే చిత్ర యూనిట్ గత కొంత కాలంగా సమంత పై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. మొదట సమంత ఈ సినిమాలో నటిస్తోంది అనగానే సావిత్రి పాత్రలో కనిపిస్తోందని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత కీర్తి సురేష్ అని తెలిసింది. జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో ఆమె కనిపించనుంది. అయితే సావిత్రి బయోపిక్ అని చెప్పి ఆమెకు సంబంధించిన విషయాలను కాకుండా సమంత పాత్ర ద్వారానే జనాలను ఎక్కువగా ఆకర్షిస్తున్నారని అనిపిస్తోంది.

విజయ్ దేవరకొండ – సమంత లవ్ స్టొరీ సినిమాలో హైలెట్ అని టాక్. రిలీజ్ చేస్తోన్న పోస్టర్స్ కూడా అలానే ఉన్నాయి. అందువల్ల సావిత్రి లైఫ్ కొంచెం తక్కువగా కనిపిస్తుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టైటానిక్ వంటి సినిమాల్లో కాన్సెప్ట్ షిప్ మునగడమే అయినా లవ్ మసాలాని యాడ్ చేసి దర్శకుడు జేమ్స్ కామెరూన్ సరికొత్త ఫీల్ ను చూపించాడు. ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా అదే తరహాలో సావిత్రి నట జీవిత సముద్రంలో ఒక లవ్ స్టోరీని యాడ్ చేశాడా అని అనిపిస్తోంది. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.