భానుమతికి అభిమానిగా మారిన సమంత

0Samantha-Becomes-Fan-of-Bhanumati‘ఫిదా’ చిత్రం ఇప్పటికీ చాలా మందిని ఫిదా చేసింది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులతోపాటు ప్రముఖులు కూడా సోషల్‌మీడియాలో చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి అగ్ర కథానాయిక సమంత చేరారు. ‘ఫిదా’ సినిమా చూసిన సమంత తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు.

‘‘ఫిదా’ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది.. బ్యూటిఫుల్‌. శేఖర్‌ కమ్ముల స్వచ్ఛమైన ప్రేమ. వరుణ్‌తేజ్‌కి, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని సమంత ట్వీట్‌ చేశారు. అంతేకాదు సాయిపల్లవి ఉన్న ఏ చిత్రాన్నైనా చూడండని అభిమానులకు సూచించారు. ఆమె అద్భుతంగా నటించారని చెప్పారు. దీనికి సాయిపల్లవి ప్రతిస్పందించారు. ‘చాలా గౌరవంగా భావిస్తున్నా. మీకు ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు.

సమంత ప్రస్తుతం ‘రంగస్థలం’లో నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ కథానాయకుడు. సుకుమార్‌ దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఫిదా’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సాయిపల్లవి ‘భానుమతి’ అనే పాత్రను పోషించారు.