గోవాలో ఎంజాయ్ చేస్తున్న సామ్

0ఎప్పుడూ ఫుల్లు బిజీగా ఉండే హీరోయిన్స్ లో సమంత పేరు తప్పనిసరిగా చెప్పుకోవాలి. సినిమాలు – బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ – సమాజ సేవ ఒక్కటని కాదు అన్నీ చేస్తుంది.. దీంతో పాటు అక్కినేని వారి కోడలిగా ఉండే కమిట్మెంట్స్ కూడా. మరి ఇంతా బిజీగా ఉంటే అప్పుడప్పుడూ బ్రేక్ అవసరమే కదా. అలా ఈమధ్య ఓ చిన్న బ్రేక్ తీసుకుని చైతూ తో గోవా ఫ్లయిట్ ఎక్కింది.

సమంతా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. దీంతో అక్కడినుండి మొదట ఒక ఫోటో పోస్ట్ చేసింది. దానికి ‘గోవా – ఇట్స్ ఎ మిలియన్ లిటిల్ థింగ్స్’ అంటూ ఒక క్యాప్షన్ పెట్టింది. ‘జీవితం అంటే ఎన్నో చిన్న చిన్న విషయాలు.. ఆనందాలు’ అని అర్థమేమో! ఎందుకంటే సమంత పెద్ద స్టార్ హీరోయిన్ – లవ్ చేసి తనకు నచ్చిన చైతునే పెళ్ళాడింది – రెప్యుటెడ్ ఫిలిం ఫ్యామిలీ లో కి అడుగుపెట్టింది. ఇవన్నీ పెద్దవి కదా. సో.. సామ్ కు చిన్న చిన్న విషయాలు.. అంటే భర్తతో టైం స్పెండ్ చేయడం – గోవా బీచుల్లో తిరగడం అలా లంచ్ కు డిన్నర్ కి వెళ్ళడం.. అన్నీ ఎంజాయ్ చేయాలని నిపిస్తోందేమో. పైగా తన టీ-షర్టు పై కూడా ‘స్మాల్ ఆసమ్ థింగ్స్’ అనే క్యాప్షన్ ఉంది.

ఈ ఫోటో తర్వాత చైతు అలా స్టైల్ గా ఒక చైర్ లో కూర్చోని ఉన్న ఫోటో కూడా పోస్ట్ చేసింది. అంటే టాలీవుడ్ క్యూట్ కపుల్ తమ పనులన్నిటికీ ఓ బ్రేక్ ఇచ్చి కూల్ గా హాలిడే లో ఎంజాయ్ చేస్తున్నారన్నమాట.