ఓ బేబి .. జీవితం రెండో ఛాన్స్ ఇస్తే!

0

అక్కినేని కోడలు సమంత స్పీడ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. ఒకేసారి నాలుగైదు సినిమాల్లో నటించేస్తూ క్రేజీ స్టార్ గా వెలిగిపోతోంది. 2018 లో సమంత నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజై సర్ ప్రైజ్ చేశాయి. ఓవైపు తెలుగు సినిమా సవ్యసాచి రిలీజ్ కి వస్తుంటే – మరోవైపు శివకార్తికేయన్ సరసన నటించిన తమిళ చిత్రం రిలీజైంది. సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా ఒకేసారి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ బరిలోకి వస్తున్నాయి. ఇందులో తెలుగు సినిమాలు `మజిలీ` `ఓ బేబి` క్యూలో నిలుస్తుంటే సామ్ నటించిన ఓ తమిళ చిత్రం సూపర్ డీలక్స్ ఈనెల 29న రిలీజ్ బరిలో దిగుతోంది.

సమంత- చైతన్య జంటగా నటించిన `మజిలి` చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఈలోగానే సమంత నాయికగా నందిని రెడ్డి దర్శకత్వం వహించిన `ఓ బేబి- ఎంత సక్కగున్నావే` ఈ సమ్మర్ లోనే రిలీజ్ కి రెడీ అవుతోందని ప్రకటించారు. గత కొంతకాలంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లోని ఇండోర్ సెట్స్ లో కీలకమైన షెడ్యూల్ ని చిత్రీకరించారు. వారం క్రితమే 60శాతం చిత్రీకరణ పూర్తయిందని తెలిపారు. తాజాగా ఓ బేబి టాకీ చిత్రీకరణ పూర్తయిందని సామ్ స్వయంగా ఇన్ స్టాగ్రమ్ లో వెల్లడించారు.

“ఈరోజు నా జీవనగమనంలో ఎంతో గొప్పగా ఉందనిపిస్తోంది. నా గమ్యం ఏంటో తెలుసుకునే క్రమంలో జనాలతో పాటు దేవుడు సాయం చేశారు. నాకు నేను వ్యక్తిగతంగా.. వృత్తి గతంగా ఎదిగేందుకు కొంత సమయం తీసుకున్నాను. ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ నేటి ఈ ఎదుగుదల ఎంతో సంతృప్తికరంగా ఉంది. ఓ బేబి చిత్రీకరణ పూర్తయింది“ అని సమంత ఎంతో ఓమోషనల్ గా ట్వీట్ చేశారు. నా హృదయంలో మై డియర్ డైరెక్టర్ నందిని రెడ్డికి ప్రత్యేకమైన చోటు ఉంది. మోస్ట్ మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ రోల్ ని నాకు ఇచ్చినందుకు..! అని సమంత దర్శకురాలిని పొగిడేసారు. మిస్ గ్రానీ అనే ఓ కొరియన్ సినిమాని `ఓ బేబి` టైటిల్ తో తెలుగులో అధికారికంగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ- సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సమంత .. సీనియర్ నటి లక్ష్మి తో కలిసి డ్యాన్సులు చేస్తున్న ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేయడం ఆసక్తికరం. ఈ ఫోటోల్లో ఆ వయసులో ఇది సాధ్యమా? అనేంతగా.. లక్ష్మీ ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్నారు. తనే నేను.. నేనే తను! అనే అర్థం వచ్చేలా సామ్ ఇన్ స్టాలో వ్యాఖ్యను జోడించారు. అంటే 60 ఏళ్ల భామగా తన పాత్రతో లక్ష్మీ పాత్ర అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారన్నమాట!!
Please Read Disclaimer