చైతూని చూసినంతనే సమంత అలా అనుకుందట

0

మొదటి సినిమాలో కలిసి పని చేసిన హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవటం తెలిసిందే. రీల్ లైఫ్ లో హిట్ పెయిర్ లు రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకోవటం గతంలో జరిగిందే. ఇటీవల కాలంలో అందునా టాలీవుడ్ లో అలాంటిది నాగచైతన్య.. సమంత విషయంలోనే జరిగింది.

తొలిసినిమాలో ఇద్దరు ఎవరికి వారు పని చేసినా.. తర్వాత వారు నటించిన మనంలో వారి మధ్య రిలేషన్ మొదలై సీరియస్ కావటం తెలిసిందే. వీరిద్దరి విషయంలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న కాన్సెప్ట్ లేదని చెప్పాలి. మొదటి చూపుకే గుండెల్లో గంటలు మోగని వీరి మధ్య కాలం మరింత దగ్గరితనాన్ని తీసుకురావటమేకాదు.. చివరకు భార్యభర్తలు అయ్యారు.

ఒకరిపట్ల మరొకరు మర్యాదగా. గౌరవంగా ఉండటం.. అన్యోన్యయత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇంతకీ.. సమంత.. నాగచైతన్యలు ఒకరినొకరు చూసిన మొదటి క్షణంలో ఏమనుకున్నారు? అన్న ప్రశ్నకు వారు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఈ ఇద్దరి సమాధానంలో సమంత చెప్పిన జవాబు ఆసక్తిగానే కాదు.. గడుసు పిల్లే అన్న భావన కలగటం ఖాయం.

సమంతను తొలిసారి తాను ఏం మాయ చేసావె షూట్ కు ముందు ఫోటోలు చూపించారని.. పేరు చెప్పి.. మన సినిమాలో నటిస్తోందని చెప్పినప్పుడు.. అమ్మాయి బాగుంది.. హీరోయిన్ గా ఓకే అనుకున్నట్లు చెప్పారు చైతూ. మరి.. చైతూను చూసినంతనే సమంత ఎలా రియాక్ట్ అయ్యారంటే.. ఆమె చెప్పిన సమాధానం ఒక పట్టాన జీర్ణించుకోలేం.

సమంత పొజిషన్లో ఉండి ఆలోచిస్తే ఆమె చెప్పింది నిజమేననిపిస్తుంది. షూట్ లో కలిశారని.. అప్పటికి ఎవరి గురించి ఆలోచించే పరిస్థితుల్లో తాను లేనని చెప్పారు. అప్పటికి తనకు తెలుగు రాకపోవటం.. ఏడెనిమిి పేజీలున్న డైలాగుల్ని చెప్పించేవారన్నారు. సెట్ లోకి రాగానే స్క్రిప్ట్ ను చూసుకుండిపోయేదానినని.. డైలాగ్ గుర్తుకు వస్తే చేతులు వణికేవన్నారు. చైతూని చూడగానే.. ఫర్లేదు.. అమాయకుడే అనుకున్నానని చెప్పిన సమంత.. ఇప్పటికి అమాయకుడే అంటూ నవ్వేసింది. మొత్తానికి గడుసు పిండమే సుమి.
Please Read Disclaimer