నన్ను టెన్షన్ పెట్టిన సినిమా అది

0

మజిలి సినిమాతో కెరీర్ లో బెస్ట్ హిట్ అందుకున్నాడు చైతూ. ఇంకా చెప్పాలంటే సమంతను పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా మజిలీనే. దీంతో.. సినిమా ఎలా ఉంటుందా అని – రిలీజ్ అయిన తర్వాత ఫలితం ఎలా ఉంటుందా అని ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూశారు. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది మజిలీ. దీంతో.. తన కష్టమంతా మర్చిపోయానని చెప్తోంది సమంత.

సాధారణంగా సమంత ఏ విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోదు. సినిమాల్ని కూడా చాలా సెలెక్టివ్ గా చేస్తుంది. మంచి కథ – మంచి కాంబినేషన్ మత్రమే చూసుకుంటుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి అన్ని కమర్షియల్ సినిమాలే రావడం – అందరూ స్టార్ డైరెక్టర్లే కావడంతో సక్సెస్ సరదాగా వచ్చేసింది. కానీ పెళ్లైన తర్వాత సమంతలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు సమంత అక్కినేని వారి ఇంటి కోడలు. సో.. తీస్తే మంచి సినిమాలు తీయాలి – విడుదలైతే హిట్ అవ్వాలి – మంచి పేరు తేవాలి అని ఆలోచిస్తుంది. అందుకే.. ఏరికోరి మజిలీ సినిమా ఒప్పుకుంది. సినిమా అయితే ఒప్పుకుంది కానీ షూటింగ్ మొదలైన దగ్గరనుంచి ఒకటే టెన్షన్.

అసలు ఈ సినిమా ఆడుతుందా లేదా అని. అసలు ఈ కథని తానే యాక్సెప్ట్ చేశానా అనే డౌట్ కూడా వచ్చిందట సమంతకు ఒకానొక సమయంలో. ఇక దేవుడి మీదే భారం వేసి ఎలాగైనా సినిమా హిట్ అవ్వాలని రాత్రి పగలూ తేడా లేకుండా టెన్షన్ పడింది. మొత్తానికి మజిలీ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.

చైతూతో పెళ్లైన తర్వాత ఏ విషయాన్ని ఈజీగా తీసుకోలేకపోతుంది సమంత. అందుకే మజిలీ సినిమా విషయంలో బాగా టెన్షన్ పడింది. అదీగాక మజిలీ సినిమా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చే సినిమా. కమర్షియాలిటికీ చాలా దూరంగా ఉన్న సినిమా. అందుకే మజిలీ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అని భయపడింది. కానీ తీరా సినిమా విడుదలయ్యాక సూపర్ హిట్ టాక్ రావడంతో పండగ చేస్కుంటోంది సమంత.
Please Read Disclaimer