రాహుల్ కు ఫన్నీ షాక్ ఇచ్చిన సామ్

0టాలీవుడ్ – కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన సమంత తాజాగా ‘యూటర్న్’ అనే చిత్రాన్ని చేసింది. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కాబోతున్న కారణంగా చిత్రం ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. తాజాగా చెన్నైలో ఈ చిత్రం మీడియా సమావేశంను నిర్వహించడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో చిత్రంలో నటించిన రాహుల్ రవీంద్రన్ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో సమంత మరియు రాహుల్ రవీంద్రన్ లు సరదాగా మాట్లాడుకోవడం కనిపించింది.

ఇద్దరు కలిసి ఏదో ఆసక్తికర విషయం చర్చించుకుంటూ రాహుల్ వేలు ఏదో చూపిస్తున్నట్లుగా ఉన్న ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. రాహుల్కు ట్విట్టర్ లో ఒక అభిమాని ఈ ఫొటో ట్వీట్ చేసి సమంతకు ఏం చెబుతున్నారు అంటూ ప్రశ్నించాడు. సదరు అభిమాని ప్రశ్నకు సమాధానంగా రాహుల్.. ప్రీ క్లైమాక్స్ సన్నివేశంలో నువ్వు అద్బుతంగా నటించావు సామ్ అది నీ అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుంది అంటూ పోస్ట్ చేశాడు.

రాహుల్ పోస్ట్ పై వెంటనే స్పందించిన సమంత.. లేదు లేదు.. నువ్వు అలా చెప్పలేదు. ఆ సమయంలో మనం ఇద్దరం కలిసి దర్శకుడు పవన్ ను తిట్టుకుంటున్నాం కదా అంటూ ఫన్నీ ట్వీట్ చేసింది. సమంత సమయస్ఫూర్తికి అభిమానులు ఫిదా అవుతున్నారు. సమంత ఆత్మగా పేరు దక్కించుకున్న డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి భర్త ఈ రాహుల్ రవీంద్రన్ అనే విషయం తెల్సిందే. చిన్మయితో పాటు రాహుల్ కూడా సమంతకు చాలా మంచి స్నేహితుడు. అందుకే రాహుల్ కు ఇలా చిన్న షాక్ కు సమంత ఇచ్చి ఆశ్చర్యపర్చింది.