సమంత న్యూ ఎక్స్పోజింగ్ లుక్…

0సమంతా గ్లామర్ పాత్రల విషయంలో తన పంథాను మార్చుకుంటోందా అంటే సినీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఏమాయ చేసావే సినిమా నుంచి నిన్నటి అత్తారింటికి దారేది సినిమా వరకు గ్లామర్ విషయంలో కొన్ని హద్దులు పాటిస్తూ యువతరం కలల రాణిగా భాసిల్లుతున్న ఈ సుందరి తాజాగా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న అంజాన్ చిత్రంలో కొత్త అవతారంలో కనిపించబోతోంది. సూర్య కథానాయకుడిగా నటిస్తున్నారు. Samantha-Hot-Pose-in-Anjaan

ముంబై మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సూర్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడని చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రం కోసం ఇటీవలే ఓ పాటను హీరో హీరోయిన్‌లపై చిత్రీకరించారు. ఈ పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుందట. ఈ పాటలో సమంతా కురచ దుస్తులు ధరించి పూర్తిగా కొత్త అవతారంలో కనిపించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముంబై, గోవాలో ఇప్పటి వరకు 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ముంబై విస్ట్‌లింగ్ వూడ్స్ క్యాంపస్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్టులో ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తిరుపతి బ్రదర్స్ సన్నాహాలు చేస్తున్నారు.Suriya-Samantha-Anjaan-Photos