సమంతా కు సిద్దార్థ్ పై ఎన్నో అనుమానాలు

0Samantha-sidప్రకాష్ రాజ్ సమంతాలు ఇద్దరు ఒకే క్లాస్ మేట్స్ అని చాలా ఆలస్యంగా తెలిసింది. ఇది తెలుసుకున్న అందరు ఇదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారు. కానీ అందుకు సంబందించిన పూర్తి వివరాలు గురించి నటుడు సిద్దార్థ్ కి బాగా తెలుసు. కారణం ఈ విషయాన్ని మొదటిసారిగా కనుక్కున్న వ్యక్తి అతనే.

హీరో సిద్దార్థ్ సామంత ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని కోలీవుడ్ కోడై కొస్తుంది. కానీ మాకు ఎటువంటి సంబంధం లేదంటూ వీరిద్దరూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో జోకులు వేసుకుంటూ తెగ నవ్వుకుంటున్నారు. సమంతా గురించి హీరో సిద్దార్థ్  ఓ విషయాన్ని కనుకున్నాడు. దాన్నే సమంతకు ఈ విధంగా చెప్పాడు. ” నేను ఓ విషయం తెలుసుకున్నాను. నువ్వు మరియు ప్రకాష్ రాజ్ ఇద్దరూ ఒకే క్లాస్ మేట్స్ అంట కదా. అయితే ప్రకాష్ రాజ్ నాకు జూనియర్ అవుతాడు.

నేను అమితాభ్ ఒకే బ్యాచ్ వాళ్ళం” అని చెప్పాడు. దాంతో సమంతా ఒకటే నవ్వులు నవ్వింది. సమంతా కు సిద్దార్థ్ పై ఎన్నో అనుమానాలు ఉన్నాయట. సమంతాకు వచ్చే అనుమానాలు ప్రశ్నలు ఏమన్నా ఉంటె అవి సిద్దార్థ్ గురించే అని తనే స్వయంగా చెప్పుకుంటుంది.