సమంత బాగా పెంచింది

0Samanthaఏ మాయ చేసావే ‘జెస్సీ’ గా తెలుగు తెర కు పరిచయం అయిన సమాంత ప్రస్తుతం నెంబర్ వన్ రేసు లో కొనసాగుతుంది. గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుని మొదటి చిత్రం ఏ మాయ చేసావే నుండి నిన్నటి రామయ్య వస్తావయ్య చిత్రం వరకు కూడా తను నటించిన చిత్రాలు అన్ని సూపర్ హిట్ అవడం తో సమాంత ఇప్పుడు టాప్ రేసు లో ఉంది.
ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వం లో బెల్లం కొండ సురేష్ కొడుకు హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో సమాంత 2 కోట్ల వరకు పారితోషకం డిమాండ్ చేస్తునంటు ఫిలిం నగర్ వర్గాలు చెపుతున్నాయి. ఇంత అడగడానికి కూడా సమాంతకు టాలీవుడ్ లో అంత డిమాండ్ ఉండడం కూడా కావచ్చు.ఇంకా ఈ చిత్రం లో సమాంత లిప్ లాక్ సీన్స్ లో నటిస్తుందని వార్త.

Tags : సమంత బాగా పెంచింది, samantha has increased remuneration, samantha remuneration