సమంతకు అర్జున్ రెడ్డి బాగా నచ్చాడట

0Samantha-Impress-with-Arjunయంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి.. రీసెంట్ టాలీవుడ్ సెన్సేషన్ అనాల్సిందే. ఏ సర్టిఫికేట్ తో రిలీజ్ అయిన ఈ మూవీని.. జనాలు ఫుల్లుగా ఎంజాయ్ చేసేస్తున్నారు. అడల్ట్ కంటెంట్ అని సెన్సార్ తీర్పు ఇస్తే.. జనాల వెర్షన్ మాత్రం యూత్ ఫుల్ మూవీ అనే విధంగా ఉంది. యంగ్ స్టర్స్ లో ఈ కుర్రాడికి ఉన్న క్రేజ్ కారణంగా.. సినిమా సెన్సేషనల్ వసూళ్లను సాధిస్తూ.. తొలి వీకెండ్ నాటికే బయ్యర్లను లాభాల్లోకి తీసుకొచ్చేసింది.

ఈ చిత్రాన్ని ఒరిజినాలిటికీ దగ్గరగా తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కుర్ర హీరో.. హీరోయిన్లంతా వరుసపెట్టి తెగ పొగిడేస్తున్నారు. ఇప్పటికే నాని.. వరుణ్ తేజ్.. అను ఇమాన్యుయేల్ లు అర్జున్ రెడ్డిని పొగడగా.. ఇప్పుడు ఆ లిస్ట్ లో స్టార్ హీరోయిన్ అయిన సమంత కూడా చేరిపోయింది. “చాలా కాలం తర్వాత నేను చూసిన సినిమాల్లో సహజత్వానికి దగ్గరగా ఉన్న మూవీ అర్జున్ రెడ్డి. టాలీవుడ్ కి గోల్డెన్ డేస్ మనతోపాటే ఉన్నాయి. అర్జున్ రెడ్డి టీం అద్భుతం” అంటోంది సమంత.

తమ సినిమాలను మాత్రమే కాకుండా.. మూవీ బాగుంటే ఇతర హీరో హీరోయిన్ల సినిమాలను సెలబ్రిటీలు ప్రమోట్ చేసే కల్చర్ పెరుగుతుండడాన్ని అభినందించాలి. అయితే.. త్వరలో సమంత-విజయ్ దేవరకొండ కలిసి ఓ మూవీలో కనిపించనున్నారు. సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న మహానటిలో ఓ జర్నలిస్ట్ పాత్రలో సమంత కనిపించనుండగా.. ఎన్టీఆర్-ఏఎన్నార్ రోల్స్ లో ఒకటి విజయ్ దేవరకొండతో చేయిస్తున్నారనే టాక్ ఉంది.