పవన్ పార్టీలోకి సమంత

0samantha-janasenaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో సమంత తన వంతుగా ప్రజల కోసం సేవ చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది మూవీలో హీరోయిన్ గా సమంత నటించింది.

సమంతను ఒక హీరోయిన్ గా కంటే, సమంతలోని సామాజిక సేవకు పవన్ ఎంతో ముగ్థుడయ్యాడు. సమంత చేసిన సామాజిక సేవలను పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు వ్యక్తిగతంగానూ పొగిడాడు. సమంత పై పవన్ కళ్యాణ్ కు ఉన్న ఈ అభిమానమే సమంతను జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆకర్షించాయని టాక్స్ వినిపిస్తున్నాయి. సమంత త్వరలోనే ఓ పెద్ద సామాజిక ఆర్గనైజేషన్ ను ప్రారంభించబోతుంది. అంత కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ తో సంప్రదించి, ‘పార్టీలో తన వంతుగా సేవ అందిస్తానని, అయితే పార్టీలో కీలక పాత్ర అంటూ ఏమి వద్దు, పార్టీ కార్యకర్తగానే పనిచేస్తాను’ అని చెప్పుకొచ్చింది. అందుకు పవన్ కళ్యాణ్ నుండి చూద్దాం అనే సమాధానం మాత్రమే వచ్చినట్టు సమాచారం వినిపిస్తుంది.

అయితే సమంత సామాజిక సేవను పక్కన పెడితే, ఇండిస్ట్రీలోని ఓ బలమైన వర్గం చేతిలో సమంత కాల్షీట్స్, సమంత పర్సనల్ లైఫ్ ఇప్పటీగా బంధీగానే ఉందని కొందరు అంటున్నారు. దీంతో పొరపాటున సమంత వ్యక్తిగత జీవితంకు సంబంధించిన భారీ ఉదంతం బయటకు వస్తే, అది పార్టీకు మంచిది కాదని పవన్ ఆలోచిస్తున్నాడట. అందుకే సమంతకు నో చెప్పేయవచ్చని అంటున్నారు. పవన్ పార్టీలోకి సమంత వస్తే, పవన్ ఆహ్వానిస్తాడా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.