కూల్ గా చైతూ.. వర్రీ అవుతున్న సామ్

0

భార్యలెప్పుడూ అంతే.. భర్త ఇంటికి రావడం లేటయితే చాలు అర డజను కాల్స్ చేసి ఏంటి విషయం అని అరా తీస్తారు. భర్త ఏదైనా కాస్త ఆలోచిస్తూ కూర్చుంటే చాలు.. అయన మనసులో ఏముందో తెలుసుకునే వరకూ వాళ్ళకు నిద్రపట్టదు. ‘ఏం లేదు’ అని భర్త అంటే.. ‘ఊహు ఏదో ఉంది’ అంటూ ప్రాణం తీస్తారు. మన పిచ్చిగానీ సాధారణ గృహిణి అయినా అంతే.. నాగచైతన్య భార్యామణి సమంతా అయినా అంతే!

సమంతా ఈమధ్య చాలా వర్రీ అయిపోతోందట. ఎందుకంటే.. భర్త చైతూ కెరీర్ గురించి. ‘యుద్ధం శరణం’ ఫ్లాపు.. ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఓపెనింగ్స్ జోరుగానే ఉన్నా చివరకు చతికిల పడింది.. ‘సవ్యసాచి’ మొదటి రోజునుండే ఎడమ చేతిని ఎత్తేసింది.. రెండో రోజుకు రెండు చేతులూ ఎత్తేసింది. చైతు ఒక జెంటిల్ మాన్ అని కూల్ గై అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫ్లాపులు.. హిట్లు తనను ఇంచ్ కూడా కదిలించలేవు. దీంతో ఎప్పటిలాగే తన పని తాను చేసుకుపోతున్నాడట. కానీ భార్య సమంతాకు మాత్రం భర్త కెరీర్ విషయంలో బెంగ పెట్టుకుందట.

భార్యా భర్తలు ఇద్దరూ కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. దీంతో దర్శకుడిని ప్రతి సీన్ తీసేముందు ఆ సీన్ నిజంగా ఆడియన్స్ ను మెప్పిస్తుందా లేదా డబల్ చెక్ చేసుకోమని కోరుతోందట. ఈ సినిమాతో భర్తకు హిట్ రావాలని ఆరాట పడుతోందట.
Please Read Disclaimer