నాకు పెళ్లి ఎపుడో జరిగిపోయింది: సమంత

0samantha-and-naga-chaitanyaతమ ప్రేమ వివాహంపై నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్యను ఆమె వివాహమాడనున్న విషయంతెల్సిందే. ఈ వివాహం అక్టోబరు నెలలో జరుగనుంది. ఈ పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఆమె తాజాగా ఓ ఇంగ్లీష్ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. చైతూను చూసిన మరుక్షణమే ఆయన ప్రేమలో పడిపోయానని చెప్పింది. ‘ఏ మాయ చేశావే’ సినిమాతో మొదలైన తమ ప్రేమ ప్రయాణం .. పెళ్లి వరకూ వచ్చిందని అంది. అక్టోబర్లో అందరి సమక్షంలో తమ పెళ్లి జరుగుతుందనీ.. నిజానికి తన మనసులో తమ పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందని చెప్పుకొచ్చింది.

వాస్తవానికి చిత్రపరిశ్రమలో ఒక్కో సినిమాకి కొన్ని నెలల పాటు కలిసి పనిచేయవలసి వస్తుంటుంది. ఆ సమయంలో యంగ్ హీరోలు .. హీరోయిన్లు లవ్‌లో పడటం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ తాము ప్రేమలో ఉన్నట్టుగా వాళ్లు అంత తేలికగా ఒప్పుకోరు. అలాంటిదేం లేదని కొట్టిపారేస్తూ వస్తుంటారు. అయితే, సమంత మాత్రం ఇలాంటివేం లేకుండానే చైతూతో తన ప్రేమ వ్యవహారం గురించి సమంతా చాలా తేలికగా అందరికీ చెప్పేసింది.