ఏంటి ఈ ఘోరం: అతడిని సమంత ఎలా హగ్ చేసుకుంది?

0Samantha--morphed-photoఈ మధ్యనే పెళ్లయిన సమంత నాగచైతన్యని కాకుండా.. ఏదో సినిమా సీన్‌లో కాకుండా ఓ మామూలు వ్యక్తిని హగ్ చేసుకుంది. ఇలాంటి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫొటో చూస్తే మరీ టూమచ్‌గా అన్పిస్తోంది కదా. ఇదేముందు మున్ముందు ఇలాంటి ఘోరాలు మరిన్ని చూడబోతున్నాం.

ఆ మధ్య “నేనే రాజు నేనే మంత్రి” సినిమా సమయంలో మీకు గుర్తుండే ఉంటుంది. రాణా పక్కన నిలబడి ఫొటో దిగినట్లు చాలామంది ఫోజులు ఇచ్చారు. మెల్లగా పెరిగిపోతున్న ఓగ్‌మెంటెడ్ రియాలిటీ (Augmented Reality) ద్వారా ఇవన్నీ సాధ్యపడుతున్నాయి. నిజంగా అవతలి వ్యక్తులు మన దగ్గర లేకపోయినా వారితో మనం ఉన్నట్లు భ్రాంతిని కలుగజేసేలా ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.

ఓగ్‌మెంటెడ్ రియాలిటీని ఆసరాగా చేసుకుని గూగుల్ ప్లేస్టోర్‌లో InGage వంటి పలు రకాల యాప్స్ కూడా వచ్చేశాయి. ఇవి సెలబ్రిటీలను, ప్రముఖ హీరోయిన్ల రెడీమేడ్ ఫోజులను చూపిస్తాయి. వాళ్ల పక్కన నిలబడ్డట్లు ఫొటోలు కేప్చర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఓ ఓగ్‌మెంటెడ్ రియాలిటీ యాప్‌లో సమంత మనోడిని హగ్ చేసుకున్నట్లు సంతోషపడిపోతున్నాడు. పెళ్లిలో మామ నాగార్జునను హగ్ చేసుకున్న ఫొటో సాయంతో నాగ్ స్థానంలో తాను వచ్చేలా InGage యాప్‌తో మార్ఫింగ్ చేశాడు ఆ యువకుడు. వీడియో చూస్తే ఈ కాన్సెప్ట్ గురించి మీకు అర్థమవుతుంది.

ఈ ధోరణి చూస్తుంటే మున్ముందు ఫేస్‌బుక్, వాట్సాప్‌ల నిండా ఇలాంటి వైపరీత్యాలు తప్పేలా లేవు. టెక్నాలజీ జనాల ఊహలకు రెక్కలిస్తోందో లేక జనాల్ని అగాధంలోకి నెట్టొస్తోందో అర్థం కావట్లేదు! ముఖ్యంగా ఓగ్‌మెంటెడ్ రియాలిటీ వల్ల ఫలానా అమ్మాయి, ఫలానా అబ్బాయి నాతో తిరిగారు అని ఫేక్ ప్రూఫులు సృష్టించే వారు ఎక్కువవుతారు.