ఆ జంట లవ్ లో ఎనిమిదేళ్ల సందిగ్ధత?

0

అక్కినేని నాగచైతన్య – సమంత జంట ప్రేమాయణం గురించి తెలిసిందే. `ఏమాయ చేశావే` చిత్రంతో సమంత టాలీవుడ్ కి పరిచయమైంది. యువతరం డ్రీమ్ గాళ్ గా వెలిగిపోయిన సామ్ అక్కినేని బుల్లోడు నాగచైతన్య మనసు దోచేసింది అప్పుడేనా? ఆ తర్వాతనా? అన్న సందేహాలున్నాయి. అయితే ఆ ఇద్దరి మధ్యా ఎనిమిదేళ్ల పాటు ప్రేమ దోబూచులాడిందట. ఆ సమయంలో ఏదో ఒకటి తేల్చుకోలేని సందిగ్ధావస్తలోనే ఉండిపోయారట ఇద్దరూ.

ఆ ఇద్దరూ కెరీర్ అప్పుడే ప్రారంభించారు కాబట్టి `ఏమాయ చేశావే` సినిమాలో చూపించినట్టే ప్రేమ.. కెరీర్ అనేవి ఆ ఇద్దరినీ ఆ కన్ఫ్యూజన్ లోకి నెట్టేశాయనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రఖ్యాత ఫిలింఫేర్ కి ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ “ఒకే పాయింట్ దగ్గర ఎనిమిదేళ్ల సమయం వేచి చూశాం. నేను అతడిని ఇష్టపడినప్పుడు తన ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఆ తర్వాత మేం ఒకరినొకరం అర్థం చేసుకున్న తర్వాత లవ్ కి ఓకే చేద్దామా అనుకుంటే ఊహించని ఇతర కారణాలు వెయిట్ చేయించాయి. ప్రేమ.. పెళ్లి విషయంలో అంత సుదీర్ఘమైన సమయం తీసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి“ అని తెలిపారు.

మొత్తానికి ప్రేమ .. పెళ్లి .. కెరీర్ బిజీ తో ముడిపడి ఉన్నాయని ఈ జంట విషయంలో ప్రూవ్ అయ్యింది. ఏమాయ చేశావే సినిమాతో స్నేహితులు అయినా 2014 నుంచి ఆ ఇద్దరి మధ్యా ప్రేమాయణం టేకాఫ్ అయ్యింది. 2018 అక్టోబర్ 6న పెళ్లి చేసుకున్నారు. హిందూ – క్రిస్టియన్స్ స్టైల్స్ లో ఈ జంట వివాహం జరిగిన సంగతి తెలిసిందే. గోవాలో డెస్టినేషన్ తరహా వెడ్డింగ్ ని అక్కినేని ఫ్యామిలీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం పెళ్లి తర్వాత సమంత- చైతన్య జోడీ నటించిన మజిలీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer