ట్యాటూ సీక్రెట్ చెప్పేసిన సమంత

0టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నా.. సమంత కాస్త స్పెషల్. గ్లామర్ కోణం కంటే అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది ఆమె తీరు. సమంత గురించి చెప్పాల్సి వస్తే.. అందానికి అందంతో పాటు..సామాజిక అంశాల మీద ఆమె స్పందించే తీరు.. మీడియాను డీల్ చేసే పద్దతి మిగిలిన వారికి భిన్నంగా ఉంటాయని చెప్పాలి.

టాప్ హీరోయిన్ గా ఉంటూ.. ఒక పెద్ద సినిమా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లే అవకాశం సమంతకు దక్కిందని చెప్పాలి. సూటిగా.. స్పష్టంగా ఉండే సమంత.. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్భంగా పలు అంశాల్ని చెప్పుకొచ్చారు.

చైతన్య.. తన చేతికి ఉండే ఒకేలాంటి ట్యాటూ అర్థం ఏమిటి? ఆ గుర్తుకు ఏదైనా లెక్క ఉందా? అన్న ప్రశ్నకు ఆమె అసలు విషయాన్ని చెప్పేశారు. ఆన్ స్క్రీన్ లో తామిద్దరం ఆర్టిస్టులమని.. ఆఫ్ స్క్రీన్ లో వాస్తవంలో బతకాలన్నది తమ ఇద్దరి ఆలోచనగా ఆమె చెప్పారు.

చాలామంది స్టార్స్ అంటే అలా ఉంటారు.. ఇలా ఉంటారని చెబుతారని.. వాళ్లు ఫుల్ హ్యాపీగా ఉంటారు లేదంటే వాళ్లకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటూ ఊహించుకుంటూ ఉంటారు. కానీ.. ఒకరి జీవితం ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేరు. అందరూ మనుషులేనన్న విషయంతో పాటు.. తమ ఇద్దరి చేతుల మీద ఒకేలా ఉంటే ట్యాటూ గుట్టు ఏమిటంటే.. మేమిద్దరం అని.. వాస్తవంలో ఉందామని అంటూ అసలు విషయాన్ని రివీల్ చేశారు.