మరో ‘మజిలీ’ లో సామ్ రోల్ ఇదే

0

అక్కినేని నాగచైతన్యతో సమంత మరో మజిలీ చేయబోతున్నారా?.. ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తికర చర్చ ఇది. పెళ్లి తర్వాత చై- సామ్ జంటగా నటించిన తొలి సినిమా `మజిలీ` కెరీర్ రికార్డ్ బ్రేకింగ్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇప్పటికే మజిలీ 60 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిందని టీమ్ అధికారికంగా ప్రకటించింది. 2019 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ల జాబితాలో ఈ సినిమా చేరిందని ట్రేడ్ సైతం విశ్లేషిస్తోంది. ఈ సినిమాని కొనుక్కున్న బయ్యరు.. డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా ఉన్నారు. ఈ విజయంలో చైతన్య ను మించి సామ్ పాత్ర ఎంతో పెద్దది అన్న ముచ్చటా వినిపిస్తోంది. సమంత అద్భుత నట ప్రావీణ్యం ఈ చిత్రాన్ని ఆ స్థాయిలో నిలబెట్టిందని క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదే నేపథ్యంలో నాగచైతన్య – సమంత జోడీ మరోసారి తెరపై కనిపించబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. అక్కినేని నాగచైతన్య హీరోగా అజయ్ భూపతి సినిమాలో కీలకపాత్రకు సమంతను ఎంపిక చేసుకున్నారు. మజిలీ తర్వాత మరోసారి భార్యభర్తలు ఒకే సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ ప్రచారంతో బాలీవుడ్ తరహాలో బ్లాక్ బస్టర్ కపుల్ కాంబినేషన్లో వరుసగా ఈ తరహా సినిమాల్లో నటించే వీలుంటుందని చెబుతున్నారు.

ఆర్ ఎక్స్100 సినిమాతో సంచలన విజయం అందుకున్న అజయ్ భూపతి ఇప్పటికే చైతూకి కథ వినిపించి ఓకే చేయించుకున్నారు. దానికి ఓ ఆసక్తికర టైటిల్ ని ఫిక్స్ చేశారని… ఈ సినిమాలో మహా అనే పాత్ర కోసం సమంతను ఎంపిక చేసుకుంటే బాగుంటుందని నాగచైతన్యకు సూచించారని చెబుతున్నారు. ఈ సినిమా కథ మొత్తం..కథానాయిక చుట్టూనే తిరుగుతుందట. ఇందులో నాగచైతన్య పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తారు. హీరో – విలన్ మైండ్ గేమ్ లో మహా పాత్ర ఏమిటన్నదే సినిమా. అందుకే సామ్ ఓకే చెప్పే వీలుందట. ప్రస్తుతం కథా చర్చలు సీరియస్ గా సాగుతున్నాయని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. వెంకీమామ పూర్తయ్యే క్రమంలోనే చైతూ ఈ మూవీ పై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారట. నేడు అక్కినేని కోడలు సమంత బర్త్ డే సందర్భంగా అభిమానుల నుంచి సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఫ్యాన్స్ కి సామ్ తాజా ప్రాజెక్ట్ ఓ చక్కని కానుక అనే చెప్పుకోవాలి. హ్యాపీ బర్త్ డే టు యు సామ్.
Please Read Disclaimer