మామ కు థాంక్స్ చెప్పిన సమంత

0అక్కినేని నాగార్జున , కోడలు సమంత ఫై ప్రశంసలు కురిపించాడు.తాజాగా రంగస్థలం చిత్రాన్ని చూసిన నాగ్..సినిమా చూసిన అనంతరం తన ట్విట్టర్ లో స్పందించారు. చిత్ర యూనిట్ తో పాటు కోడలు నటన బావుందంటూ మురిసిపోయారు. అద్భుత నటనతో పాత్రకు ప్రాణం పోశావ్ అని మెచ్చుకున్నారు. ఈ నటను చూసి గర్వపడుతున్నానన్నారు. రామ్‌చరణ్‌ కూడా తన పాత్రలో ఒదిగిపోయారని ప్రశంసించారు. డైరెక్టర్ సుకుమార్ మంచి సినిమాను తెరకెక్కించావ్… మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేశావ్ అన్నాడు.

నాగార్జున ప్రశంసలకు వెంటనే సమంత… థ్యాంక్స్ మామ అంటూ రిప్లై ఇచ్చింది. మామ, కోడలు ఆప్యాయతను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన రంగస్థలం మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.