పొద్దున్న బికినీ.. సాయంత్రం ఓణి

0Samantha-Turns-To-Bikini-to-Traditional-Avtarహీరోయిన్ అనే క్రేజ్ తో పాటు ఈ అమ్మాయి మన ఆడపిల్ల లాంటిదే అనే క్రేజ్ ఉన్న ఏకైక సౌత్ హీరోయిన్ సమంత ఇప్పుడు తమిళ్ తెలుగు సినిమాలులలో బాగ బిజీగా ఉంది. సౌత్ అంతా ఇప్పుడు సమంత జపం చేస్తుంది. సినిమాకు సరిపడే అందం చూపిస్తూ అందరితో అల్లరి చేస్తూ అటు సినిమా వాళ్ళని ఇటు అభిమానులును ఒకేసారి ఆకట్టుకుంటుంది. ఈ తెలుగింటి కోడలు.

నిన్నటి ఉదయం JFW మ్యాగజైన్ కోసం చేసిన ఒక చేనేత బికినీ వేసుకొని ఉన్న ఫోటో షూట్ అమ్మడు షేర్ చేసింది. ఆ ఫోటోలో తన వంపులుతో అందరి దృష్టిని తన పై తిప్పుకుంది. అంత వయ్యారంగా తన సొగసలు చూసిన అభిమానులు ఊపిరి ఆగినంతపనైంది అనుకోండి. సోషల్ మీడియా అంతా నిమిషాలలో వైరల్ అయిపోయింది. అవి ఇంకా పూర్తి కాకముందే మరో మెరుపులాంటి ట్విస్ట్ ఇచ్చింది సమంత. ఇప్పుడు తమిళ్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంది ఈ సుందరి.. అక్కడ శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఒక పల్లెటూరు అమ్మాయిగా కనిపించనుంది. దాని కోసం ఒక ఎర్ర ఓణి చుట్టుకొని తన చందన్ని మరింత న్యాచురల్ గా దారబోసింది. ఇలా ఒకే రోజు తమ అభిమాన నటిని పొద్దున్న బికినీ నుండి సాయంత్రం ఓణికి మారే రూపాంతరం చేస్తే ఎవరైనా ఆహా అని నోరెళ్ళబెట్టక తప్పదు.

తన ఫ్రెండ్ కొ- స్టార్ నాగ చైతన్యతో పెళ్లి కుదిరినప్పటి నుండి ఈ కొత్త తెలుగు కోడలు అల్లరి బాగానే పెరిగింది. ఎవరు ఎన్ని అనుకున్నా అభిమానులు మాత్రం ఫుల్ ఖుష్ అనే చెప్పాలి. త్వరలోనే తెలుగులో రాజు గారి గది 2.. రంగస్థలం 1985 వంటి సినిమాల్లో కనిపించనుంది.