సమంత కిడ్నాప్ చేస్తోంది!!

0రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా దాదాపుగా ఫిక్సయిపోవచ్చు. సమ్మర్ కు ముందు రిలీజయిన ఈ మూవీ కలెక్షన్ల దుమ్ము దులిపేసింది. ఇందులో హీరో రామ్ చరణ్ – హీరోయిన్ సమంతల నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో పాటలన్నీ మ్యూజికల్ హిట్ కావడంతో ఇప్పటికే ప్రతిచోటా వినిపిస్తున్నాయి.

రంగస్థలం మూవీలో రంగమ్మ.. మంగమ్మ పాటయితే జనాలకు విపరీతంగా నచ్చేసింది. యూట్యూబ్ లో ఈ వీడియో సాంగ్ కు ఇప్పటికే 49 మిలియన్ వ్యూస్ పైగా వచ్చేశాయి. ఈ పాటకు రీసెంట్ గా ఓ బుడతడు డ్యాన్స్ చేసిన వీడియో నెట్ లో వైరల్ గా మారింది. ఎలిమెంటరీ స్కూల్ లో చదివే ఆ అబ్బాయి ఎక్స్ ప్రెషన్స్.. డ్యాన్స్ లో ఈజ్.. స్టెప్పులు చూస్తే అదిరిపోవాల్సిందే. ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత వరకు ఈ వీడియో ఈజీగానే చేరింది.

ఈ వీడియో చూశాక సమంత కూడా ఇంప్రెస్ అవకుండా ఉండలేకపోయింది. ఆ పిల్లాడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ‘‘ఓకే ఈ క్యూటీని నేను కిడ్నాప్ చేసేస్తున్నాను’’ అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టింది. రంగమ్మా.. మంగమ్మా పాటతో సమంతను అందరినీ మెప్పిస్తే ఈ బుడతడు అదే పాటతో సమంతనే మెప్పించేశాడు.