ఓ పని పూర్తి చేసిన సమంత

0ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక సినిమా హిట్ అయితే మరో సినిమా ఊహించని విదంగా డిజాస్టర్ అవుతోంది. దీంతో చాలా నెమ్మదిగా సినిమాలు ఒకే చేస్తున్న వారు ఎక్కువ అవుతున్నారు. అయితే ఎవరు ఎలా వెళ్లినా కూడా అక్కినేని సమంత మాత్రం అస్సలు తగ్గడం లేదు. అక్కినేని వారి ఇంట్లో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ స్టార్ గా ఎదిగిపోతోంది.

ఇప్పటికే రంగస్థలం మహానటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ ఇటీవల అభిమన్యుడు సినిమాతో కూడా మరో మంచి హిట్ అందుకుంది. తెలుగు తమిళ్ లో సమంత స్టార్ డమ్ చాలా పెరుగుతోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. సమంత మరో డిఫరెంట్ సినిమా షూటింగ్ ను రీసెంట్ గా ఫినిష్ చేసింది. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ సూపర్ డీలక్స్ షూటింగ్ ను సమంత ఇటీవల పూర్తి చేశారు. గతంలో సినిమాకు సంబంధించిన ఒక టీజర్ ను రిలీజ్ చేసిన సమంత ఒక హత్య చేస్తున్నట్లు కనిపించింది.

అప్పుడే సినిమాపై అంచనలు పెరిగాయి. ఇక ఫైనల్ గా సమంత తనకు సంబంధించిన షూటింగ్ ను ఫినిష్ చేసింది. చిత్ర యూనిట్ తో చివరగా ఒక పార్టీ కూడా చేసుకొని సందడి చేసింది. ఈ ప్రాజెక్ట్ లో ఫహాద్ అలీ రమ్య కృష్ణ కూడా ఉన్నారు. దర్శకుడు మిస్కిన్ కూడా ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ఒక ముఖ్య పాత్ర పోషించాడు. థియాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.