సంపత్ ప్రొడక్షన్ ఏం జరుగుతుందో?

0సంపత్ నంది అటు దర్శకత్వంతో పాటు ఇటు నిర్మాణంలో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏమైంది ఈ వేళ అంటూ డైరెక్షన్ ఎంట్రీ ఇచ్చిన ఈ డైరెక్టర్.. ఆ తర్వాత రచ్చ అంటూ రాంచరణ్ మూవీతో మంచి సక్సెస్ నే అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బెంగాల్ టైగర్ పెద్దగా హిట్ కాలేదు కానీ.. గౌతమ్ నంద మాత్రం తీవ్రంగా డిజప్పాయింట్ చేసింది.

మరోవైపు గాలిపటం అంటూ ఓ సినిమాను నిర్మించిన ఈ దర్శకుడు.. ఇప్పుడు మరో మూవీని నిర్మిస్తున్నాడు. పేపర్ బోయ్ అంటూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. ఫిలిం మేకర్ శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రియ హర్షి.. తాన్యాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడీ సినిమాకు ఫస్ట్ లుక్ ఇచ్చేందుకు రంగం సిద్థం అయింది. అయితే.. దర్శకుడిగా ఇప్పటివరకూ తను ఉన్నత స్థాయికి చేరడంలో ఫెయిల్ అవుతున్న సంపత్ నంది.. నిర్మాతగా ఎలాంటి ఫలితం అందుకోనున్నాడో అంతు పట్టడం లేదు.

ఫిలిం మేకింగ్ విషయంలో పక్కా మాస్ మసాలా అంశాలనే నమ్ముకుంటాడు సంపత్ నంది. ఒక రకంగా హీరోయిజం ఎలివేషన్ ఇవి బాగానే ఉపయోగపడినా.. అవి మాత్రమే సినిమాను సక్సెస్ చేయలేకపోతున్నాయి. రచ్చ విషయంలో మినహా మరెక్కడా ఇవి వర్కవుట్ కాలేదు. నిర్మాతగా లోబడ్జెట్ తో సినిమాలు రూపొందిస్తున్న సంపత్ నంది.. పేపర్ బోయ్ విషయంలో ఎలాంటి స్టోరీని ఎంచుకున్నాడో చూడాలి. హీరో అండ్ డైరెక్టర్ కొత్త వాళ్లే కాబట్టి.. మాస్ ఎలిమెంట్స్ ను కాకుండా.. లవ్ అండ్ యూత్ ఫుల్ స్టోరీతో సేఫ్ జర్నీకే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయంటనున్నారు.