ఫిఫీ ద్వీపంలో బికినీ సుందరి !

0

కన్నడ భామ సంయుక్త హెగ్డే పేరు తెలుసా? తెలిస్తే సరే.. లేకపోయినా తెలియని వాళ్ళకోసం చెప్పుకోవాలిగా. నిఖిల్ ‘కిరాక్ పార్టీ’ సినిమాలో హీరోయిన్. ఆ సినిమా హిట్ కాలేదు కానీ లేకపోతే ఈపాటికి కనీసం మన యూత్ లో పదిశాతం మందికి ఇన్సామ్నియా వచ్చిఉండేది. ఆ సినిమా హిట్ కాకపోవడంతో తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు.. దాంతో కన్నడలోనే కంటిన్యూ అవుతోంది.

అయితే టాలీవుడ్ విషయం ఏమాత్రం పట్టించుకోదు సంయుక్త. ఈ భామ ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీబిజీ. సంయుక్త ఇన్స్టాగ్రామ్ చూస్తే ఒక శృంగారదేవత పర్సనల్ ఫోటో ఆల్బమ్ లాగ ఉంటుంది. బికినీలు.. క్లీవేజి షోలు.. నాభి సౌందర్యాలు.. అబ్బో. ఒక్కటేమిటి ..ఇలా అన్నిరకాల ఫోటోలను మార్చిమార్చి పోస్ట్ చేస్తూ నెటిజనులను తన మాయలో పడేస్తుంది. అదే ట్రెండును కొనసాగిస్తూ తాజాగా ఒక సెల్ఫీ పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు ‘మెస్సీ హెయిర్.. ఐ డోంట్ కేర్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అర్థం అయింది కదా.. “జుట్టు చిందరవందరగా ఉంది అయినా పట్టించుకోను”. నెటిజనులు కూడా ఆ జుట్టును పట్టించుకోరు కదా!

అయితే ఈ ఫోటో తీసింది ఎక్కడనుకున్నారు. ఫిఫీ ద్వీపంలో. అదెక్కడ ఉంది అంటే.. థాయ్ ల్యాండ్ లో. ఫుకెట్ కు కాస్త దగ్గరగా. అంటే ఈ భామ అక్కడ బీచ్ లో బికినీలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోందన్నమాట. బికినీలో ఎన్నో రకాలు ఉంటాయి కానీ ఇలా సగం పసుపు సగం నలుపు డిజైన్ ఉండే క్రేజీ బికినిని ఎక్కడ కొనుక్కుందో ఏంటో. ఈ ఫోటో సెల్ఫీ కావడంతో ఫోటోగ్రఫీ టాలెంట్ క్రెడిట్ అంతా సంయుక్తకే ఇవ్వాలి. నిలబడి కనిపించాల్సినవన్నీ కనిపించేలా అవసరం లేని రెండో కన్ను.. తలవైపు పార్ట్ ను ఎడిట్ చేసినట్టుగా సెల్ఫీ తీసిందే.. అద్భుతం!

కే రాఘవేంద్రరావు గారి లాంటి కళాపిపాసి… సౌందర్యోపాసి డైరెక్టర్ కాకుండా ఒక సినిమాటోగ్రాఫర్ అయి ఉన్నా ఇలాంటి యాంగిల్ లో అందాన్ని కెమెరాలో బంధించగలిగి ఉండేవాడు కాదేమో. అన్నట్టు మొదటి పారాగ్రాఫ్ లో ఇన్సామ్నియా అనుకున్నాం కదా.. అదేనండీ నిద్రలేమి.. ఈ ఫోటోను.. ఫోటోలోని అందాలను చూస్తే…వాటిని చూడగలిగే కళ్ళు నిజంగా ఉంటే అది రావడం ఖాయమే!
Please Read Disclaimer