బాల నటి బోల్డ్ అడల్ట్ లుక్

0

బాలనటిగా మెరుపులు మెరిపించి కథానాయికలుగా రాణించలేకపోయిన భామలెందరో. ఈ జాబితాలో బేబి షామిలి.. షాలిని వంటి పేర్లు సౌత్ లో ప్రముఖంగా వినిపిస్తాయి. ఆ కోవలోనే బాలీవుడ్ కి వెళితే `కుచ్ కుచ్ హోతా హై` ఫేం .. బాలనటి సనా సయీద్ గురించి చెప్పుకోవాలి. కింగ్ ఖాన్ షారూక్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `కుచ్ కుచ్ హోతా హై`లో సనా అద్భుతంగా అభినయించింది. బాలనటిగా పలు క్రేజీ చిత్రాల్లోనూ నటించిన ఈ అమ్మడి వయసు నేటితో 30.

టీనేజీ దాటుకుని మిడిలేజీకి చేరుకుంది… అంటే పెద్ద తెరపై కథానాయికగా వెలుగులు విరజిమ్మాల్సిన టైమ్ ఇది. కానీ ఎందుకనో సనా బాలీవుడ్ లో క్లిక్ కాలేకపోయింది. ఆ క్రమంలోనే టెలివిజన్ షోలతో టైమ్ పాస్ చేస్తోంది. ఇక పెద్ద తెరపై రాణించేందుకు అవసరమైనన్ని ఛాన్సుల్ని సనా దక్కించుకోవడంలో విఫలమైంది. అయితే అందరూ మర్చిపోయానా.. ఇలాంటి వాళ్లు సామాజిక మాధ్యమాల వెల్లువలో తిరిగి అభిమానులకు చేరువవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సనా ఇన్ స్టాగ్రమ్ ద్వారా అభిమానులను పలకరిస్తోంది. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లను పోస్ట్ చేస్తూ అందరికీ హాయ్ చెబుతోంది. ఇప్పటికే తనని 6లక్షల మంది సనా ఇన్ స్టాని అనుసరిస్తున్నారు. 10లక్షల (1 మిలియన్) మందికి ఇన్ స్టాని చేరువ చేయడమే లక్ష్యంగా సనా హీటెక్కిస్తోంది.

తాజాగా నాభి సౌందర్యాన్ని ఎలివేట్ చేస్తూ సనా ఇచ్చిన ఫోజు కుర్రకారు గుండెల్లోకి దూసుకుపోయింది. ఇలాంటి బోల్డ్ ఫోటోలు ఇన్ స్టాలో మరిన్ని పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. మునుముందు ఇంకా బెస్ట్ ట్రీట్ ఉంటుందని అమ్మడి వాలకం చెబుతోంది. తాజా ఫోటోలో నాభికి కాస్త ఎగువగా ఆ పచ్చబొట్టు అంతే ఆకర్షిస్తోంది. ఇక జల్లెడ తరహా టాప్ లో పాక్షికంగా లోదుస్తుల్ని ఎలివేట్ చేస్తూ అమ్మడు ఓ రేంజులోనే వేడెక్కించింది. ఇంత చేశాక అయినా ఛాన్సులిచ్చేవాళ్లు కరుణించకపోతారా!!
Please Read Disclaimer