రజిని 2.0 లో యూట్యూబ్ హాట్ గాళ్

0


Sanchana-Natarajan-in-Rajinఇండియాలో ఇప్పుడు మునిపటి కంటే ఎక్కువగా టివిలు సినిమాలు కన్నా ఇంటర్నెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు యూత్. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ హవా పోయి వెబ్ సిరీస్ హవా నడుస్తుంది. అలా వెబ్ సిరీస్ నుండి కొంతమంది వెండితెరకు కూడా వెళ్లారు. ఇప్పుడు అలాంటి లిస్ట్ లో తమిళనాడుకి చెందిన ఒక యూట్యూబ్ స్టార్ ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించే అవకాశం కొట్టేసింది.

సంచన నటరాజన్.. ఈ పేరు మనం విని ఉండం కానీ తమిళనాడులో వెబ్ సిరీస్ చూసే ప్రతి వారికి తెలుసు. “ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ కాదల్” అనే వెబ్ సిరీస్ తో మంచి పాపులర్ అయ్యింది సంచన. ఆమె చేసిన దివ్య కారెక్టర్(వెబ్ సిరీస్) గురించే అడుగుతున్నారట జనాలు. నేను కూడా 90 శాతం దివ్య లానే ఉంటాను అంటోంది అమ్మడు. ప్రేమ అంటే నమ్మకం ఉంది పెళ్లి పై గౌరవం ఉంది అని చెప్పింది. నేను కాలేజీ చుదువుతున్నప్పటి నుండి కొన్ని టాలెంట్ షో లో పాల్గొనే అనుభవం ఉంది. అలావచ్చిందే బాలాజీ శక్తివేల్ ఫిల్మ్ లో ఛాన్స్. అది చూసిన 2.0 సినిమాలో చిన్న ఛాన్సిచ్చారు అని చెప్పింది. నేను చేసినది చిన్న పాత్ర అయినా కూడా ఉన్నంత సేపు రజినీకాంత్ తోనే ఉంటుంది. అందుకే అన్నాను నా జీవితంలో ఊహించనది జరిగిందని.. అంటూ మురిసిపోయింది అమ్మడు.

ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే.. అటు వెబ్ సిరీస్ లోనూ ఇటు 2.0 సినిమాలోనూ చాలా హోమ్లీ లుక్ లో కనిపించిన ఈ సంచన.. ఇప్పుడు సడన్ గా ఒక హాటెస్ట్ ఫోటో షూట్ ఒకటి చేసింది. మరి ఈమె మిస్సిండియా చెన్నయ్ ఫైనలిస్టు కాబట్టి.. ఆ మాత్రం హాటుగా ఉండటంలో తప్పేంలేదులే. కాకపోతే వెబ్ సిరీస్ లో పక్కింటి పిల్లలా కనిపించి.. ఇక్కడ ఇలా కనిపిస్తావా అంటూ జనాలు కామెంట్లతో చంపేస్తున్నారట. అది సంగతి. .