పవన్ రూట్ లో సందీప్ కిషన్

0sandeep-kishanటాలీవుడ్ హీరోలు అందరికి ఈ రోజు రోల్ మోడల్ పవన్. తమ సినిమాలలో ఏదో విధంగా పవన్ నామస్మరణ ఉండేటట్టు గా చూసుకుని తమ ఇమేజ్ ను పెంచు కోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రీసెంట్ సూపర్ హిట్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో గొంతు విప్పి పాడిన దగ్గర నుంచి మిగతా హీరోలు కూడా తమదైన శైలిలో గొంతు సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే మరొకరి సినిమా కోసం పాట పాడటం అరుదైన సంగతి. సందీప్‌కిషన్‌ ఇప్పుడు ఆ బాటలోనే పయనిస్తున్నాడు. తమిళ డబ్బింగ్ చిత్రం ‘ఇదేగా ఆశపడ్డావ్‌ బాల – కృష్ణ’ చిత్రం కోసం తొలిసారి పాట పాడాడు సందీప్. విజయ్‌ సేతుపతి, స్వాతి జంటగా నటించిన చిత్రమిది గోకుల్‌ దర్శకుడు. ఇందులో ‘నీ బెస్ట్‌ ఫ్రెండ్‌కి మహేష్‌లాంటి మొగుడు దొరక’ అనే సరదా గీతాన్ని ఆలపించారు సందీప్‌.  అంతేకాదు సామ్రాట్‌తో కలసి ఈ గీత రచనలో కూడా పాలుపంచుకొన్నారు. ”ప్రేమించి మోసం చేసిన అమ్మాయిని అల్లరిగా తిడుతూ సాగే గీతమిది. సందీప్‌ చక్కగా పాడాడు అని అంటున్నారు .

ఈ మధ్యనే వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ ద్వారా హిట్ కొట్టిన సందీప్ కు ఈ పాట ఎటువంటి క్రేజ్ ఇస్తుందో చూడాలి.  ఒకేఒక హిట్ సినిమా చేతికి రావడంతో సందీప్ కూడ నిర్మాతలకు పారితోషికం విషయంలో చుక్కలు చూపిస్తున్నాడు అని అంటున్నారు.