కరీనా దారిలో మరో ప్రెగ్నెంట్ సెలబ్రిటీ

0ఒకప్పుడు సెలెబ్రిటీలు ఎవరైనా ప్రేగ్నన్ట్ అయితే ఇంటి గడప దాటి బయటకి వచ్చేవారు కాదు – ఎంత వీలైతే అంత పబ్లిక్ ఈవెంట్స్ నుండి తప్పించుకునే వారు. ఈ విషయం బయటకి పొక్కకుండా జాగ్రత్తలు పడేవారు. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోయిన్లు తాము తల్లి కాబోతున్నాము అని సంతోషంగా ఫాన్స్ తో పంచుకోవడమే కాదు బయటికి వచ్చేసి కెమెరా కి పోజులు ఇచ్చేస్తున్నారు.

హాలీవుడ్లో ఈ తెఱందు ఎప్పటినుండో నడుస్తోంది కాని బాలీవుడ్లో ఈ హవా తక్కువనే చెప్పాలి. కాని ఈ ట్రెండుని మొదలుపెట్టింది మాత్రం కరీనా కపూర్ ఖాన్. కొన్ని నెలల కింద ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఈ విషయాన్ని దాచి పెట్టలేదు. కెమెరాల నుండి తపించుకోలేదు. గర్వంగా అందరి ముందు నిలబడి మాట్లాడేది. ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేది. ఫోటోషూట్లో కూడా పాల్గొంది. చూస్తుంటే మరొక సెలబ్రిటీ ఈమెదారిలో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఆమె ఎవరో కాదు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.

రెండు మూడు నెలల క్రితమే ఈమె తల్లి కాబోతున్న విషయం తన ఫాన్స్ తో ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. యిపుడు ఈమె బయట కూడా దర్శనమిస్తోంది. ముంబై లో ఒక ఈవెంట్ పని మీద వచ్చిన ఈమె ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కింది. అలానే బంజారా హిల్స్ లో కూడా కనిపించింది. సంతోషంగా కెమెరా కు పోజులు కూడా ఇచ్చింది. సానియా మీర్జా ఆరు నెలల గర్భవతి. అక్టోబర్లో బిడ్డకు జన్మనివ్వడానికి తయారవుతోంది మన టెన్నిస్ స్టార్