రామ్‌చరణ్‌ దంపతులు సానియా మీర్జా తో ఇలా

0ram-cheran-upasana-saniya-mకథానాయకుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సోషల్‌మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తన వ్యక్తిగత విశేషాలను పంచుకుంటూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు చెబుతుంటారు. కాగా ఆమె తాజాగా తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఇందులో చెర్రీ దంపతులు టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాతో కనిపించారు. వీరు ముగ్గురు కలిసి మంచులా తెల్లగా ఉన్న ఓ పదార్థంతో సరదాగా ఆడుకుంటూ కనిపించారు. ఉపాసన, సానియా ఆ పదార్థాన్ని వెదజల్లగా చెర్రీ.. చేతిలో దాన్ని పట్టుకుని వారిని చూస్తూ నిల్చున్నారు. ఈ వీడియోకు ఉపాసన.. వైట్‌ క్రిస్మస్‌, వైట్‌ న్యూయర్‌, రామ్‌చరణ్‌ అనే హ్యష్‌ట్యాగ్‌లను జత చేశారు. దీన్ని సానియా కూడా రీట్వీట్‌ చేశారు. సరదాగా ఉన్న ఈ వీడియో సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

చరణ్‌ ప్రస్తుతం ‘రంగస్థలం’ సినిమాలో నటిస్తున్నారు. ‘ధృవ’ హిట్‌ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. సుకుమార్‌ దర్శకుడు. సమంత కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.