దండుపాళ్యం 2: నగ్న దృశ్యాలపై సంజన స్పందన

0దండుపాళ్యం 2 సినిమాకు సంబంధించిన కొన్ని నగ్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాల్లో హీరోయిన్ సంజనను కట్టేసి నగ్నంగా నిలబెట్టి తీవ్రం హింసిస్తున్నట్లు ఉంది. ఇంత దారుణమైన దృశ్యాలు చూసి అంతా షాక్ అయ్యారు.

వైరల్ అయిన ఈ దృశ్యాలపై హీరోయిన్ సంజన స్పందించారు. ఆ సీన్ నిజమే అని, సన్నివేశం బాగా పండాలనే ఉద్దేశ్యంతోనే తాను నగ్నంగా నటించినట్లు సంజన తెలిపారు.

సీన్ డిమాండ్ చేసినపుడు, ఆ సీన్ పండించడానికి నగ్నంగా నటించడంలో తప్పేమీ లేదనేది నా ఉద్దేశ్యం. అందుకే దర్శకుడు ఈ సీన్ గురించి చెప్పగానే ఒకే చెప్పాను. నటిగా మంచి పేరు వస్తుందనే కారణంతోనే తాను ఇలాంటి సీన్లు చేసినట్లు సంజన తెలిపారు.

ఎంతో కష్టపడి తాను నటించానని, అయితే తాను నటించిన నగ్న దృశ్యాలను సెన్సాన్ అనుమతించలేదని, ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని, వాస్తవికతను చూపించడానికే ఆ సీన్ చేశాం. కానీ సెన్సార్ తిరస్కరించడంతో తాము పడ్డ శ్రమ వృధా అయిందని సంజన వాపోయారు.

సెన్సార్ అభ్యంతరం తెలిపిన ఆ సీన్లు సోషల్ మీడియాలో ఎలా లీక్ అయ్యాయో తనకు తెలియదని, ఇది ఆందోళన కలిగించే విషయమే అని సంజన అన్నారు.

ఆ సీన్లు చూసిన చాలా మంది మూవీలో ఉంటాయని భావిస్తున్నారు. కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత అలాంటి సీన్లు లేకుంటే నిరాశకు లోనవ్వడం సహజం. అందుకే ఇలాంటి సీన్లు సినిమాలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం జరిగితే బాగోదు. దయచేసి ఈ సీన్లు ఉన్నాయని ఎవరూ భావించ వద్దు అని సంజన విజ్ఞప్తి చేశారు.

కాగా… దండుపాళ్యం 2 మూవీ కన్నడతో పాటు తెలుగులో రిలీజ్ అవ్వాల్సి ఉండగా….. పలు కారణాలతో తెలుగు రిలీజ్ ఆలస్యం అవుతోంది. గత వారమే ఈ చిత్రం కన్నడలో రిలీజ్ అయింది. అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది.

కన్నడలోనే ఆ నగ్న దృశ్యాలు తొలగించారంటే… తెలుగులో కూడా ఇలాంటి సీన్లు ఉండే అవకాశం లేదు. కేవలం ఆ సీన్లు ఉన్నాయని థియేటర్లకు వెళితే మాత్రం నిరాశ తప్పదు.

ఇప్పటి వరకు అసహజ శృంగారానికి సంబంధించిన సీన్లు ఉన్న సినిమాలన్నీ వివాదాస్పదం అయ్యాయి. దండుపాళ్యం 2 మూవీలో ఇద్దరు మహిళల మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉండటం కూడా వివాదానికి దారి తీసే అవకాశం ఉంది.

2012లో దండుపాళ్యం పార్ట్ 1 తొలుత కన్నడలో రిలీజైంది. అక్కడ విజయవంతం కావడంతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి ఫలితాలే సాధించింది. అప్పట్లో కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 40 కోట్ల వసూలు చేసింది. తొలి భాగం పెద్ద హిట్ కాబట్టి ఇపుడు వచ్చే సినిమాపై అంచనాలు మరింత ఎక్కువగా ఉంటాయని, ఈ సారి కన్నడ, తెలుగు మార్కెట్లో కలిపి కనీసం రెట్టింపు… అంటే దాదాపు రూ. 80 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

మొదటి భాగంలో దండుపాళ్యం గ్యాంగ్ అఘాయిత్యాలు చూపెడితే…. పార్ట్ 2లో ఈ గ్యాంగ్ జైలు జీవితం గురించి, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, పోలీసుల చేతిలో ఎలాంటి హింసలకు గురయ్యారు, జైలు నుండి తప్పించుకోవడానికి ఏం చేశారు లాంటి సంఘటనలు చూపించబోతున్నారు.

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, సంగీతం: అర్జున్‌, కో-డైరెక్టర్‌: రమేష్‌ చెంబేటి, నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌, నిర్మాత: వెంకట్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.