మార్ఫింగ్ చేసి చంపేశారన్న హీరోయిన్

0Sanjana-Clarification-on-heసంజనా గల్రానీ.. టాలీవుడ్ జనాలకు బాగానే తెలిసిన ఈ భామ.. కన్నడ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది. అక్కడ వరుస సినిమాలతో ఊపు మీదున్న ఈ భామ.. దండుపాళ్యం చిత్రానికి సంబంధించిన లీక్డ్ వీడియో కారణంగా వివాదంలో చిక్కుకుంది. అయితే.. ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ వస్తున్న తరుణంలో.. దీనిపై తన వెర్షన్ చెప్పింది సంజన.

‘జేమ్స్ బాండ్ సినిమా అయినా సరే 100 శాతం నగ్నంగా నేను ఎప్పటికీ నటించను. అది మార్ఫింగ్ చేశారు. ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గా ఒక రోల్ కు న్యాయం చేయడానికి నాపై చాలా ఒత్తిడి ఉంటుంది. నా కళకు న్యాయం చేసేందుకు నేను ప్రయత్నించినా.. సంస్కృతి.. విలువలు.. నియమాలు.. మహిళలగా నా ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుంటాను. ఆ సీన్ షూటింగ్ సమయంలో నేను ఒక గ్లామరస్ బ్యాక్ లెస్ టాప్ వేసుకున్నాను. ప్రస్తుతం దేశంలో 95 శాతం మహిళలను ఇది ధరిస్తున్నారు. ఇది బోల్డ్ ప్రయత్నం అని నాకు తెలుసు’ అని చెప్పింది సంజన.

‘ సినిమాకు హెల్ప్ అవుతుందనే ఆ సీన్ చేశాను. నేను చేసిన చంద్రి పాత్రకు అది ముగింపు. ఆ రోల్ కి సింపథీ లభిస్తుందని ఆశించాను. కానీ ఆ సీన్ కి కంప్యూటర్ ఎఫెక్ట్స్ జోడించిన తర్వాత.. వల్గర్ గా మారిపోవడం చూసి షాక్ తిన్నాను. మొత్తం వీడియోను మార్ఫింగ్ చేసి కేరక్టర్ ను చంపేశారు. ఇలాంటి అనవసరమైన ప్రచారం నాకు అక్కర్లేదు. ఆ సీన్ ను తొలగించిన సెన్సార్ నిర్ణయాన్ని గౌరవిస్తాను. అయితే.. ఈ న్యూడ్ సీన్ కారణంగా సినిమాకి హెల్ప్ అవుతుందని భావించడం లేదు’ అని చెప్పింది సంజన.