ఎన్నికల్లో పోటీపై మరో స్టార్ హీరో క్లారిటీ!

0

ఒకవైపు తను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సౌతిండియన్ స్టార్ హీరో కమల్ హాసన్ స్పష్టతను ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తన పార్టీని ఎన్నికల బరిలో నిలిపిన కమల్ తను మాత్రం పోటీలో లేనట్టుగా స్పష్టం చేశారు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ పోటీలో ఉంటుంది కానీ తను మాత్రం పోటీ చేయడం లేదని కమల్ క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు తనపై ఎన్నికల్లో పోటీ విషయంలో వినిపిస్తున్న రూమర్లపై సల్మాన్ ఖాన్ కూడా స్పందించాడు. తను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సల్లూ స్పష్టం చేశాడు. సల్మాన్ పోటీ విషయంలో కొన్ని రూమర్లు వినిపించాయి. అవి రూమర్లే అని తేలిపోయాయి.

ఆ సంగతలా ఉంటే.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఈ విషయంలో స్పందించారు. సంజూబాబా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఆ ప్రచారానికి దత్ తెర దించారు. తను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని దత్ కుండబద్ధలు కొట్టారు.

సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ రాజకీయ నేతగా రాణించిన బాలీవుడ్ స్టార్. ఆయన కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసి నెగ్గారు. కేంద్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన కూతురు కొనసాగిస్తూ ఉంది. సునీల్ దత్ కూతురు – సంజయ్ దత్ సోదరి మాన్యత కాంగ్రెస్ తరఫున గతంలో ఎంపీగా నెగ్గారు. ఈ సారి కూడా ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు.

ఆమెకు తన పూర్తి మద్దతు ఉందని – ఆమె ఎంపీగా నెగ్గాలని ఆకాంక్షించిన సంజయ్ దత్ తను మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. పదేళ్ల కిందటే సంజయ్ దత్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని సమాజ్ వాదీ పార్టీ వాళ్లు ప్రయత్నించారు. అయితే అప్పుడు దత్ వెనుకడుగు వేశారు. ఇప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేది లేదని అంటున్నాడు.
Please Read Disclaimer