విడాకులు వారి వ్యక్తిగతం..మళ్లీ కలుస్తారు!

0

బాలీవుడ్ స్టార్ కపుల్ హృతిక్ రోషన్ మరియు సుసాన్నెలు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. విడాకులు తీసుకున్న తర్వాత కొడుకుల కోసం స్నేహితులుగా వీరు ఉంటున్నారు. ఆ స్నేహం కాస్త మళ్లీ ప్రేమ – పెళ్లికి దారి తీసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. తాజాగా ఆ విషయాన్ని సుసాన్నె తండ్రి సంజయ్ ఖాన్ కూడా చెప్పుకొచ్చాడు. తన కూతురు అల్లుడు విడాకులు తీసుకున్నా – ప్రస్తుతం వారి పిల్లల కోసం కలిసి ఉంటున్నారు – వారు ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఒక ఇంటర్వ్యూలో సంజయ్ ఖాన్ మాట్లాడుతూ.. తన కూతురును ఇప్పటి వరకు నేను విడాకులకు కారణం ఏంటీ అంటూ ప్రశ్నించలేదు. అది వారి వ్యక్తిగత విషయం అని – వారి ఇష్ట ప్రకారం కానివ్వాలని అనుకున్నాను. అయితే విడాకులు తీసుకున్న సమయంలో నేను చాలా బాధపడ్డాను. నా మనవళ్లు భవిష్యత్తు గురించి ఆందోళన చెందాను. కాని నా కూతురు – అల్లుడు మాత్రం వారి పిల్లల కోసం స్నేహంగా ఉంటున్నారు. ప్రస్తుతం పిల్లలతో పిక్నిక్స్ – హాలీడే ట్రిప్స్ అంటూ ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

విడాకుల సమయంలో వారి మద్య ఏం జరిగిందో నాకు తెలియదు. కాని విడాకులు తీసుకున్న తర్వాత కూడా కలిసి ఉంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా కుమార్తెను ఇప్పుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాను – హృతిక్ ను కూడా అంతే ప్రేమిస్తున్నాను. వారి సమస్యను పిల్లలపై రుద్దకుండా వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. నా మనవళ్లకు హృతిక్ తండ్రి – ఆ బంధం ఎవరు – ఎప్పటికి చెరిపేయలేనిది. ఆ బంధం లాగే సుసాన్నే – హృతిక్ ల బంధం ఉంటుందని నేను నమ్ముతున్నాను అంటూ సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. హృతిక్ మరియు సుసాన్నేలు మళ్లీ అధికారికంగా పెళ్లి చేసుకునే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సంజయ్ ఖాన్ వ్యాఖ్యలు ఆ పుకార్లకు బలం చేకూర్చుతున్నాయి.
Please Read Disclaimer