ఈ సినిమాపడితే.. జాన్వి జాక్ పాట్ కొట్టినట్లే

0శ్రీదేవి కూతురుగా జాన్వి కపూర్ సినిమా ఎంట్రీపై ముందు నుంచి అంచనాలే ఉన్నాయి. మరాఠీ మూవీ సైరత్ ను హిందీలో ధడక్ అంటూ రీమేక్ చేయనుండగా.. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ మెప్పించింది. రాబోయే ఫ్యూచర్ లో కాబోయే స్టార్ హీరోయిన్ జాన్వి అనే అంచనాలను మరింతగా పెంచింది ఈ ట్రైలర్.

ఇంకా జాన్వి కపూర్ తొలి సినిమా రిలీజ్ కానే లేదు.. అప్పుడే ఈ భామకు ఓ అద్భుతమైన అవకాశం వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించే సంజయ్ లీలా భన్సాలీతో సినిమా అంటే.. ఏ హీరోయిన్ కు అయినా లక్కీ ఛాన్స్ అనాల్సిందే. రీసెంట్ గా పద్మావత్ మూవీతో ఫిమేల్ సెంట్రిక్ సినిమాకు ఇండియాలో ఎంత సత్తా ఉందో చాటాడాయన. భన్సాలీ ఆఫీస్ కు రీసెంట్ గా జాన్వి కపూర్ వెళ్లడం హాట్ టాపిక్ అవుతోంది. యంగ్ బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి భన్సాలీ ఆఫీస్ కు వెళ్లింది జాన్వి కపూర్.

ఓ ప్రాజెక్టు గురించి మాట్లాడేందుకే భన్సాలి దగ్గరకు జాన్వి కపూర్ వెళ్లిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. నిజంగానే ఈ ప్రాజెక్టు సాకారం అయితే మాత్రం జాన్వి కపూర్ జాక్ పాట్ కొట్టేసినట్లే. శ్రీదేవి కూతురు కావడంతో ఎంట్రీ మూవీపై ఎలాగూ ఆసక్తి ఉంటుంది. ఆ తర్వాతి సినిమాను కూడా క్రేజీ ప్రాజెక్టుగా మలిస్తే మాత్రం.. స్టార్ హీరోయిన్ అయేందుకు ఈ భామకు మార్గం మరింత తేలిక అయినట్లే.