బాహుబలి చెంతకు చేరిన సంజన

0బాహుబలి మూవీ చూసిన ఎవరూ ఆ సినిమాలో కనిపించిన జలపాతాన్ని మరచిపోలేరు. మొదటి భాగంలో దాదాపు సగం సినిమా ఆ వాటర్ ఫాల్స్ దగ్గరే సాగుతుంది. కేరళలో అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఈ షూటింగ్ చేశారు. మరీ సినిమాలో చూపించినంత ఎత్తు నుంచి ఫాల్స్ ఉండవు కానీ.. కొంత రియల్.. మిగతాదంతా గ్రాఫిక్స్ లో జోడించారు.

బాహుబలి రిలీజ్ తర్వాత.. అత్తిరాపల్లి జలపాతాలను బాహుబలి వాటర్ ఫాల్స్ అనడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడే సుదీర్ఘమైన షెడ్యూల్ చేసుకుంటోంది సంజన. ప్రస్తుతం ఈమె స్వర్ణ ఖడ్గం అంటూ ఓ సీరియల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహారాణి మహాదాత్రి పాత్రలో సంజన నటిస్తోంది. ఈ పాత్రకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు.. రొమాంటిక్ సీన్స్ ను కూడా బాహుబలి వాటర్ ఫాల్స్ దగ్గర షూటింగ్ చేస్తున్నారు. ఇక్కడ చిత్రీకరించిన బాహుబలి మూవీతో పాటు.. అనేక సీరియల్స్ కూడా పెద్ద హిట్ అయ్యాయని.. ఈ సెంటిమెంట్ తమకు హుషారు ఇస్తోందని సంజన చెబుతోంది.

అనేక భాషలలో డబ్ అయి మరీ ఈ స్వర్ణ ఖడ్గం విడుదల కానుండడంతో.. ప్రస్తుతం తన దృష్టి అంతా ఈ స్వర్ణ ఖడ్గంపైనే ఫోకస్ చేసినట్లు చెబుతోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత.. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలో చేయాలంటూ అనేక ఆఫర్స్ వచ్చాయని.. కానీ ప్రస్తుతం తానీ ఈ పాత్ర పైనే ఫోకస్ చేయదలచుకున్నానని.. స్వర్ణఖడ్గం షూటింగ్ పూర్తయిన తర్వాత.. సినిమాల వైపు చూస్తానని చెబుతోంది బుజ్జిగాడి మరదలు సంజన.