బాలీవుడ్ లో కొత్త ప్రేమ జంట

0


Sara-Ali-Khan-and-Harshvardసినీ పరిశ్రమలో బోలెడన్ని ప్రేమ కథలు వినిపిస్తూ ఉంటాయి. ఉన్నవాటికి తోడు కొత్త లవ్ స్టోరీలు చాలానే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓ జంట బ్రేకప్ చెప్పుకుంటే.. ఆ వెంటనే రెండు లవ్ స్టోరీలను స్టార్ట్ చేసేస్తుంటుంది మీడియా. అలాగే ఓ జంట ఓ సినిమాలో కలిసి నటిస్తుంటే.. వారిద్దరి మధ్య ప్రేమ అంటూ హంగామా చేసి పబ్లిసిటీ సంపాందించేసే ట్రిక్కులు కూడా ఉంటాయి.

టైగర్ ష్రాఫ్- దిశా పాట్నీ.. సిద్ధార్ధ మల్హోత్రా- ఆలియా భట్ ల ప్రేమ కథలపై ఇప్పటికే పుంఖానుపుంఖాలుగా కబుర్లు వినిపిస్తుండగా.. ఇప్పుడో యువ జంట మధ్యలో ప్రేమ చిగురించిందని బాలీవుడ్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసేస్తోంది. సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్.. మరో హీరో సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్ ల మధ్య ప్రేమ కథ నడుస్తోందట. గత కొన్ని వారాలుగా వీరిద్దరు కలిసి చక్కర్లు కొట్టేస్తున్నారు. ఎక్కడ కనిపించినా కలిసే కనిపిస్తున్నారు. ఇదే వీరి మధ్య లవ్ స్టోరీ అనేందుకు బేసిక్ పాయింట్ అయిపోయింది.

రెండు రోజుల క్రితం ఓ పార్టీకి కూడా హర్షవర్ధన్- సారా కలిసి అటెండ్ కావడం హాట్ టాపిక్ అయిపోయింది. అయితే.. ఈ కొత్త ప్రేమ కహానీపై అటు హర్ష వర్ధన్ కానీ.. ఇటు సారా ఆలీ ఖాన్ కానీ ఎవరు స్పందించడం లేదు. అంతే కాదు.. ఈ ప్రేమ ముదిరి పాకాన పడిపోయిందని.. త్వరలోనే తమ ప్రేమను బహిరంగంగా చెప్పేయనున్నారనే టాక్ కూడా వినిపించేస్తోంది.