హాట్ వెదర్ లో వేడి పుట్టిస్తున్న స్టార్ హీరో కూతురు

0Sara-Ali-khan-daughter-mesmerises-allబాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్ ఇంకా సినీ అరంగేట్రం చేయలేదు. ఇప్పటికే ఈమె ఎంట్రీపై చాలానే వార్తలు ఉన్నాయ్ కానీ.. సడెన్ గా ఈ కుర్ర భామ స్టైలింగ్ మార్చేసింది. గతంలో కొన్ని సార్లు ఈ చిన్నది గ్లామర్ ఒలకబోసినా.. అమ్మ అమృతా సింగ్ నుంచి వచ్చిన రియాక్షన్ తో వెనక్కి తగ్గింది.

కానీ రీసెంట్ గా సైఫ్ భార్య.. సారా పిన్ని అయిన కరీనా కపూర్.. తన ఇంటిలోనే ఓ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సారా ఆలీ ఖాన్ ను కూడా ఇన్వైట్ చేసింది కరీనా. ఈ ఇన్ హౌస్ పార్టీకి సారా వచ్చిన గెటప్ చూసి అందరూ నోరెళ్ల బెట్టేశారు. బ్లాక్ టాప్.. మోకాళ్ల వరకూ హై బూట్స్ వరకూ ఓకే అనుకున్నా.. మినీ రేంజ్ ని మించిపోయిన డెనిమ్ షార్ట్స్ లో అమ్మడు రచ్చ చేసి పారేసింది. సారా ఈ రేంజ్ లో షార్ట్ డ్రెస్ వేసుకోవడం.. అది కూడా ఫ్యామిలీ పార్టీలో ఇలాంటి హంగామా చేయడం హాట్ టాపిక్ అయిపోయింది.

అసలే ముంబై అంతా హాట్ వెదర్ తో అల్లాడి పోతుంటే.. ఈ భామ ఇలాంటి హాట్ ప్యాంట్స్ తో మరింత వేడి రగిలించేస్తోంది. ఇంతకీ సడెన్ గా సారా ఇంత హాట్ గా ఎందుకు మారిపోయిందనే విషయమే అంతుబట్టడం లేదెవరికీ!