టెంపర్ చూపిస్తున్న సైఫ్ కూతురు

0పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా విడుదలైన ‘టెంపర్‌’ చిత్రం ను హిందీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. రోహిత్‌ శెట్టి దర్శకత్వం. ఇందులో రణ్‌వీర్‌కి జోడీగా మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటించనున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి.

కానీ ఈ సినిమాలో కథానాయికగా హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ను ఎంపికచేశారు. ఈ విషయాన్ని రోహిత్‌ శెట్టి, నిర్మాత కరణ్‌ జోహార్‌ సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ సారాతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.

కేదార్‌నాథ్‌’ చిత్రంతో సారా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. అయితే ‘కేదార్‌నాథ్‌’ సినిమా కంటే ముందు ‘సింబా’ చిత్రమే విడుదల కానుంది.