సర్కార్ : అన్నట్లుగానే చేసిన పైరసీ మేకర్స్

0

తమిళ సినిమాలతో పాటు అన్ని భాషల చిత్రాలను తీవ్రంగా భయపెడుతున్నది పైరసీ భూతం. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో తమిళ్ రాకర్స్ పైరసీని ఎక్కువ చేస్తున్నట్లుగా దేశ వ్యాప్తంటా టాక్ ఉంది. తమిళ రాకర్స్ పై ఎన్ని చర్యలు తీసుకున్నా ఎంతగా ప్రయత్నాలు చేసినా కూడా వారిని అడ్డుకోవడంలో తమిళ నిర్మాతలు విఫలం అవుతున్నారు. విశాల్ నిర్మాతల మండలి అధ్యక్షుడు అయిన తర్వాత భారీ ఎత్తున చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. ఏ ఒక్కటి కూడా ఫలితం చూపించలేక పోయాయి. తాజాగా తమిళ రాకర్స్ ‘సర్కార్’ చిత్రం మేకర్స్ కు ఒక హెచ్చరిక చేశారు.

‘సర్కార్’ విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్ డీ ప్రింట్ ను తాము విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అన్నట్లుగానే నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సర్కార్’ చిత్రంను మద్యాహ్నం వరకు హెచ్ డీ ప్రింట్ ను విడుదల చేశారు. తమిళ వర్షన్ ‘సర్కార్’ మూవీ హెచ్ డీ ప్రింట్ రావడంతో పెద్ద మొత్తంలో వసూళ్లకు గండి ఖాయం అంటూ నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సర్కార్ ప్రింట్ కూడా వచ్చేసినట్లుగా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

తమిళ రాకర్స్ హెచ్చరికల నేపథ్యంలో ‘సర్కార్’ చిత్ర యూనిట్ సభ్యులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కాని అవేవి కూడా ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి. కొన్ని థియేటర్లలో ఫోన్ లు కెమెరాలు తీసుకు పోకుండా చెక్ చేసి మరీ లోనికి పంపించారట. అయినా కూడా జరగాల్సిన నష్టం జరిగి పోయింది. వారు అన్నట్లుగానే చేసి తమ పరిధిని నిరూపించుకున్నారు. నిర్మాతలు పైరసీ కాకుండా ఆపడం అసాధ్యం అని తేలిపోయింది. మరి కొందరు మాత్రం సినిమా బాగుంటే తప్పకుండా థియేటర్లలో చూస్తారు పైరసీ గురించి ఆందోళన చెందాల్సిన పనే లేదు అంటున్నారు.
Please Read Disclaimer